Upcoming SUV Cars: మార్కెట్‌ను షేక్ చేసేందుకు సిద్ధం.. త్వరలో లాంచ్ కానున్న టాప్ కార్ల లిస్ట్ ఇదే..!

Upcoming SUV Cars
x

Upcoming SUV Cars: మార్కెట్‌ను షేక్ చేసేందుకు సిద్ధం.. త్వరలో లాంచ్ కానున్న టాప్ కార్ల లిస్ట్ ఇదే..!

Highlights

Upcoming SUV Cars: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Upcoming SUV Cars: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం దేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో ఎస్‌యూవీ విభాగం మాత్రమే 50 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. మీరు కూడా రానున్నరోజుల్లో కొత్త ఎస్‌యూవీని కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నుండి మారుతి సుజుకి వరకు అనేక కొత్త మోడళ్లు రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. అటువంటి 3 బడ్జెట్ ఫ్రెండ్లీ ఎస్‌యూవీల ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Tata Sierra

టాటా మోటార్స్ భారత మార్కెట్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సియెర్రాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టాటా సియెర్రా టెస్టింగ్ సమయంలో రోడ్లపై చాలాసార్లు కనిపించింది. ఇది కాకుండా, జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కంపెనీ దీనిని ప్రదర్శించింది. మీడియా నివేదికల ప్రకారం, సియెర్రాలో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల ఆప్షన్లు ఉంటాయి.

Hyundai Venue Facelift

హ్యుందాయ్ తన ఫేమస్ ఎస్‌యూవీ వెన్యూ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. భారతీయ రోడ్లపై పరీక్షిస్తున్నప్పుడు హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ చాలాసార్లు కనిపించింది. కొత్త వెన్యూ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌లో చాలా పెద్ద మార్పులు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే, కారు పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు ఉండే అవకాశం లేదు.

Maruti Suzuki E-Vitara

మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ న్యూఢిల్లీలో జరిగిన 2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. అది మారుతి సుజుకి E విటారా అవుతుంది. మారుతి సుజుకి ఇ విటారా తన కస్టమర్లకు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories