TVS Best Selling Bike: అపాచీని అధిగమించిన సేల్స్‌.. ధర కేవలం 44 వేలు మాత్రమే..!

New TVS Apache 160
x

New TVS Apache 160

Highlights

TVS Best Selling Bike: టీవీఎస్‌ అమ్మకాలలో ఇదొక సంచలనం. ప్రతి సంవత్సరం ఈ బైక్‌ సేల్స్‌ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

TVS Best Selling Bike: టీవీఎస్‌ అమ్మకాలలో ఇదొక సంచలనం. ప్రతి సంవత్సరం ఈ బైక్‌ సేల్స్‌ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. రోజు రోజుకి డిమాండ్‌ పెరుగుతోంది. దీనికి కారణం సామాన్యులకి అందుబాటు ధరలో లభించడమే. TVS మోటార్ జూన్ విక్రయాలని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మొత్తం అమ్మకాలు 3,02,979 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో TVS అపాచీ, స్పోర్ట్స్ వంటి బైక్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వీటిన్నిటి కంటే టీవీఎస్ ఎక్స్‌ఎల్ అత్యధికంగా అమ్ముడైంది. ఇది వాస్తవానికి మోపెడ్ కానీ అపాచీతో సహా అన్ని మోడళ్ల కంటే ఎక్కువగా అమ్ముడవుతోంది. గత నెలలో XL మోపెడ్ అమ్మకాలు 34,499 యూనిట్లుగా నమోదయ్యాయి. దీని ధర కేవలం రూ.44 వేల రూపాయల నుంచి మొదలవుతుంది.

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ ఇంజిన్, ఫీచర్లు

టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ 99.7 cc 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది 4.4PS పవర్, 6.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పేలోడ్ సామర్థ్యం 130KG. సెల్ఫ్ స్టార్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. స్పెషాలిటీ గురించి చెప్పాలంటే సైలెంట్ స్టార్ట్ అనే ఫీచర్ అందుబాటులో ఉంది. వాహనాన్ని ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ఆన్-ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఇందులో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. సామాను కోసం తగినంత ఫ్లోర్‌బోర్డ్ స్థలం ఉంటుంది. ఇది మంచి పికప్ పొందుతుంది. హెవీ డ్యూటీ షాక్ అబ్జార్బర్, మన్నికైన ఆల్-మెటల్ బాడీతో వస్తుంది.

ఎక్స్‌ఎల్‌ వేరియంట్ల ధరలు

ఇది మొత్తం 5 వేరియంట్‌లలో వస్తుంది. వాటి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

1. హెవీ డ్యూటీ రూ. 44,999

2. కంఫర్ట్ రూ. 46,671

3. హెవీడ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్ రూ. 56,815

4.హెవీడ్యూటీ ఐ-టచ్‌స్టార్ట్ విన్ ఎడిషన్ రూ. 59,317

5. కంఫర్ట్ ఐ-టచ్‌స్టార్ట్ రూ. 59,575

మిగిలిన బైక్ విక్రయాలు

జాబితాలో TVS రైడర్ (34,309 యూనిట్లు), Apache (28,127 యూనిట్లు), Ntorq (28,127 యూనిట్లు) వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కంపెనీ ఏకైక ఎలక్ట్రిక్ ఆఫర్ TVS iQube జూన్ 2023లో 14,462 యూనిట్లను విక్రయించింది. TVS స్పోర్ట్ అమ్మకాలు కూడా సంవత్సరానికి 26.52 శాతం పెరిగి 11,669 యూనిట్లకు చేరుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories