TVS iQube Celebration Edition: టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్.. 1,000 మందికే ఛాన్స్..!

TVS iQube Celebration Edition: TVS మోటార్స్ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన TVS iQube 3.4kWh, TVS iQube S వేరియంట్‌ల లిమిటెడ్ 'సెలబ్రేషన్ ఎడిషన్'ను విడుదల చేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 Aug 2024 9:01 PM IST
TVS iQube Celebration Edition
X

TVS iQube Celebration Edition

TVS iQube Celebration Edition: భారత్ మార్కెట్లో స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ ఆటోమొబైల్ కంపెనీ TVS మోటార్స్ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన TVS iQube 3.4kWh, TVS iQube S వేరియంట్‌ల లిమిటెడ్ 'సెలబ్రేషన్ ఎడిషన్'ను విడుదల చేసింది. ఇది కేవలం 1,000 మందికి మాత్రమే అందించనుంది. వీటి ప్రత్యేకత ఏమిటి? ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

TVS iQube సిరీస్ ఈ స్పెషల్ వేరియంట్ కొత్త టెక్నాలజీ, కస్టమర్ల విశ్వాసం కారణంగా దాని స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ఇప్పటివరకు 3,50,000 మంది టీవీఎస్ ఐక్యూబ్‌ను తమ సొంతం చేసుకున్నారు. సెలబ్రేషన్ ఎడిషన్‌ను కంపెనీ డిఫరెంట్‌గా కనిపించేలా డిజైన్ చేసింది. ఇది మా కస్టమర్‌ల పట్ల మా ప్రశంసలకు చిహ్నమని టీవీఎస్ వెల్లడించింది.

లిమిటెడ్ TVS iQube 3.4 kWh, TVS iQube 'సెలబ్రేషన్ ఎడిషన్' ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌తో వస్తుంది. బోల్డ్ డెకాల్స్, ప్రత్యేక బ్యాడ్జింగ్‌తో పాటు, #CelebrationEdition హ్యాష్‌ట్యాగ్ ఇందులో కనిపిస్తుంది. ఇది ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే విక్రయించనున్నారు.

iQube 4.4 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది స్కూటర్ 0 నుండి 40 kmph వరకు 4.2 సెకన్లలో పరుగెత్తేలా చేస్తుంది. అయితే దీని టాప్ స్పీడ్ 78 kmph. స్కూటర్‌లో రివర్స్ మోడ్‌తో పాటు ఎకానమీ, పవర్ అనే రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. 3.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న iQube ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ రియల్ రేంజ్ అందిస్తుంది.

దీని ధర గురించి మాట్లాడితే TVS iQube 3.4 kWh 'సెలబ్రేషన్ ఎడిషన్' ధర రూ. 1,19,628. . TVS iQube S 'సెలబ్రేషన్ ఎడిషన్' ధర రూ. 1,29,420 (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ). సెలబ్రేషన్ ఎడిషన్ వేరియంట్ బుకింగ్ ఆగస్టు 15, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 26, 2024 నుండి ఈ స్పెషల్ ఎడిషన్ డెలివరీ చేయనుంది టీవీఎస్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story