Cheapest Sports Bikes: ఇండియాలో బెస్ట్ బడ్జెట్  స్పోర్ట్స్ బైక్‌లు ఇవే.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్..!

Cheapest Sports Bikes: ఇండియాలో బెస్ట్ బడ్జెట్  స్పోర్ట్స్ బైక్‌లు ఇవే.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్..!
x
Highlights

Cheapest Sports Bikes: యువతకు స్పోర్ట్స్ బైక్‌లపై చాలా క్రేజ్ ఉంటుంది.

Cheapest Sports Bikes: యువతకు స్పోర్ట్స్ బైక్‌లపై చాలా క్రేజ్ ఉంటుంది. ఎక్కువగా యంగ్ జనరేషన్ పిల్లలు తమ తల్లిదండ్రులను స్పోర్ట్స్ బైక్ కావాలని పట్టుబడుతుంటారు. కానీ, స్పోర్ట్స్ బైక్ ధర కారణంగా తల్లిదండ్రులు వాటిపై పెద్దగా ఇంటరెస్ట్ చూపించరు. అయితే ఇలాంటి పిరిస్థితులని క్యాష్ చేసుకొనేందుకు కొన్ని బైక్ కంపెనీలు తక్కువ బడ్జెట్‌లో స్పోర్ట్స్ బైక్‌లను విడుదల చేసి యువత హృదయాలను గెలుచుకున్నాయి. ఈ క్రమంలో అటువంటి మూడు బైకుల గురించి వివరంగా తెలుసుకుందాం.

TVS Apache RTR 160 4V

ఈ జాబితాలో మొదటగా టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వి గురించి మాట్లాడితే ఈ బైక్ ధర రూ.1, 26000 ఎక్స్ షోరూమ్. బైక్‌లో 16సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్‌ ఉంది. ఈ ఇంజన్ 17.4 బిహెచ్‌పి హార్స్ పవర్, 14.73 న్యూటాన్ మీటర్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో సెగ్మెంట్-ఫస్ట్ రామ్ ఎయిర్ కూలింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ బైక్ ఇంజన్ హీట్‌ను కంట్రోల్ చేస్తుంది.

Yamaha FZ-S FI V4

ఈ జాబితాలో రెండవ బైక్ యమహా ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్ఐ వి4. ఈ బైక్ ధర రూ.1,28,900 ఎక్స్‌షోరూమ్. ఎఫ్జెడ్ ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-ఫంక్షనల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెనుక డిస్క్ బ్రేక్‌, ముందువైపు సింగిల్ ఛానల్ ఏబీఎస్, టైర్ హగ్గింగ్ రియర్ మడ్‌గార్డ్, బ్లూటూత్ ఎనేబుల్ యమహా-కనెక్ట్ యాప్‌ ఉన్నాయి

Bajaj Pulsar NS160

ఈ జాబితాలో చివరి బైక్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్160. ఈ బైక్‌ను కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో విడుదల చేసింది. బైక్ ధర రూ.1,24000 ఎక్స్-షోరూమ్. ఈ బైక్‌లో 160సిసి ట్విన్ స్పార్క్ ఇంజన్ ఉంది. 17 బిహెచ్‌పి పవర్, 14.6 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఈ ఇంజన్ రిలీజ్ చేస్తుంది. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4Vవి, హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వి, యమహా ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్ఐ బైక్‌లతో పల్సర్ పోటీపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories