Honda Prices: హోండా యాక్టివాతో సహా ఈ స్కూటర్లు చాలా ఖరీదు.. ధరలు ఎంతంటే..?

These Scooters Including Honda Activa are Very Expensive Know the Prices
x

Honda Prices: హోండా యాక్టివాతో సహా ఈ స్కూటర్లు చాలా ఖరీదు.. ధరలు ఎంతంటే..?

Highlights

Honda Prices: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా దీపావళి తర్వాత భారత మార్కెట్లో స్కూటర్ల ధరలను పెంచింది.

Honda Prices: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా దీపావళి తర్వాత భారత మార్కెట్లో స్కూటర్ల ధరలను పెంచింది. కొత్త సంవత్సరం రోజున కొత్త హోండా స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నట్లయితే ముందుగా వాటి కొత్త ధరలను తెలుసుకోవడం ముఖ్యం.

హోండా డియో: హోండా డియో ఒక గొప్ప స్కూటర్. ఇది BS-VI కంప్లైంట్. మీరు ఈ స్కూటర్‌ను కొనుగోలు చేస్తే దీనికి 109.61 సిసి ఫ్యాన్ కూల్డ్, 4 స్ట్రోక్ ఎస్‌ఐ ఇంజన్ పవర్ లభిస్తుంది. ఈ స్కూటర్ మార్కెట్‌లో 6 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. హోండా డియో బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.68,352. అయితే దీని టాప్ వేరియంట్ రూ. 72,353 ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది.

హోండా డియో స్పోర్ట్స్ ఎడిషన్: హోండా డియో స్పోర్ట్స్ ఎడిషన్ కూడా 6 రంగు ఎంపికలతో వస్తుంది. ఇందులో మీరు 109.61 cc ఫ్యాన్ కూల్డ్, 4 స్ట్రోక్ SI ఇంజన్ పవర్ పొందుతారు. స్పోర్ట్స్ ఎడిషన్ రెండు వేరియంట్లలో వస్తుంది. హోండా స్పోర్ట్స్ డ్రమ్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.68,852. మరోవైపు, డియో స్పోర్ట్స్ DLX వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,353.

హోండా యాక్టివా 6G: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి. హోండా యాక్టివా 6G మోడల్ రెండు వేరియంట్‌లు లభిస్తున్నాయి. హోండా Activa 6G STD వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 73,086 కాగా, హోండా Activa 6G DLX ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,586. ఇది 109.61 సిసి శక్తిని కలిగి ఉంది.

హోండా యాక్టివా 125: హోండా బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్టివా ఈ మోడల్ అద్భుతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తుంది. కంపెనీ 124 cc ఫ్యాన్ కూల్డ్, 4 స్ట్రోక్ SI ఇంజిన్ పవర్ ఇస్తుంది. మార్కెట్‌లో దీని బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.77,062. అయితే, దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 84,235. ఇందులో కూడా మీరు 6 కలర్ ఆప్షన్‌లను పొందుతారు.

హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్: హోండా యాక్టివా ప్రీమియం ఎడిషన్ ఈ సంవత్సరం విడుదల అయింది. యాక్టివాకు ఉన్న ఆదరణను చూసి కంపెనీ తన ప్రీమియం ఎడిషన్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.76,587.

Show Full Article
Print Article
Next Story
More Stories