Tata Nexon: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. టాటా నెక్సాన్‌పై ఏకంగా రూ. 90 వేల తగ్గింపు.. బలమైన ఫీచర్లతో సేల్స్‌లోనూ దూకుడు..

Tata Nexon: ఈ నెలలో టాటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ కార్‌పై ఏకంగా రూ.90 వేల వరకు తగ్గింపును ఆఫర్ చేసింది. శక్తివంతమైన ఇంజన్‌తో పాటు అనేక ఆధునిక ఫీచర్లు కూడా ఈ కారులో అందుబాటులో ఉన్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 10 July 2024 3:04 PM IST
tata nexon offers huge discount check price and mileage details here
X

Tata Nexon: మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. టాటా నెక్సాన్‌పై ఏకంగా రూ. 90 వేల తగ్గింపు.. బలమైన ఫీచర్లతో సేల్స్‌లోనూ దూకుడు..

Tata Nexon: టాటా మోటార్స్ కు చెందిన వాహనాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల్లో నెక్సాస్ ఒకటి. ఈ వాహనాలపై ఈ నెలలో ఆ సంస్థ భారీ ఆఫర్ ప్రకటించింది.టాటా నెక్సాన్‌పై రూ.90 వేల వరకు తగ్గింపును అందిస్తున్నట్టుగా ఆ సంస్థ బంపరాఫర్ ఇచ్చింది. శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు, ఈ కారులో అనేక అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి ఈ కారును ప్రత్యేకమైన కారుగా మార్చాయి. టాటా కంపెనీ తయారు చేసిన వాహనాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇది.

టాటా నెక్సాన్‌పై భారీ తగ్గింపు..

ఈ నెలలో టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ప్రీ-ఫేస్‌ లిఫ్ట్ మోడల్‌పై రూ.90 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ.55 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.35 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నారు.

అదే సమయంలో టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ ప్రీ-ఫేస్‌ లిఫ్ట్ మోడల్‌పై రూ.75 వేల తగ్గింపు అందిస్తోంది. ఇందులో కస్టమర్లకు రూ.40 వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.35 వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి.

టర్బో పెట్రోల్ ఇంజన్..

టాటా నెక్సాన్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ని అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 120 bhp పవర్‌తో 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్ గరిష్టంగా 110 bhp శక్తిని, 260 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బెస్ట్ ఫీచర్లు..

టాటా నెక్సాన్‌లో అనేక గొప్ప ఫీచర్లను అందించింది. ఇది 10.25 అంగుళాల డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో అందించింది.

ఇది కాకుండా కారులో ఎత్తు సర్దుబాటు చేయగల సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఫాస్ట్ USB ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ వంటి గొప్ప ఫీచర్లున్నాయి. ఈ ఫీచర్ల కారణంగా ప్రజలు ఈ కారును ఎంతగానో ఇష్టపడుతున్నారు.

ధర ఎంతంటే..

టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 8.15 లక్షల నుంచి మొదలవుతుంది. అయితే టాప్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.15.80 లక్షల వరకు ఉంది. మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి బ్రెజ్జా, కియా సెల్టోస్ వంటి వాహనాలకు ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story