Tata Motors: టాటా నుంచి అదిరిపోయే కార్లు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?


Tata Motors: టాటా నుంచి అదిరిపోయే కార్లు.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
Tata Motors: న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తన ప్రముఖ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ 'స్టెల్త్ ఎడిషన్'ను ఆవిష్కరించింది.
Tata Motors: టాటా మోటార్స్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ . దేశీయ విపణిలో కంపెనీ విక్రయించే కార్లు సురక్షితమైనవి కావడంతో వినియోగదారులు కొనేందుకు సుముఖంగా ఉన్నారు. న్యూఢిల్లీలో ఇటీవల ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టాటా మోటార్స్ తన ప్రముఖ ఎస్‌యూవీలు హారియర్, సఫారీ 'స్టెల్త్ ఎడిషన్'ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ కార్లు అమ్మకానికి కూడా అందుబాటులో ఉన్నాయి. ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
కొత్త టాటా హారియర్ స్టెల్త్ ఎడిషన్ సాధారణ హారియర్ ఫియర్‌లెస్ ప్లస్ వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఈ కారు ధర రూ.24.85 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇందులో 5 మంది సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
సరికొత్త టాటా సఫారి స్టెల్త్ ఎడిషన్ అనేది ప్రస్తుతం ఉన్న సఫారి ఎస్‌యూవీ అకాంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ క్లోన్. కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.25.30 లక్షలు. ఇందులో 7 సీట్లు ఉన్నాయి.
టాటా హారియర్, సఫారి స్టెల్త్ ఎడిషన్ మోడల్స్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్‌లో ఎటువంటి మార్పు చేయలేదు. ఈ కార్లలో 168 బిహెచ్‌పి హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని విడుదల చేసే 2.0-డీజిల్ ఇంజన్ ఉంది. అలానే 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంది.
ఈ టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ ఎస్‌యూవీల డిజైన్ పాత మోడల్‌ల మాదిరిగానే ఉంటుంది. అంతే కాకుండా ఎక్ట్సీరియర్‌లో 'స్టెల్త్' బ్యాడ్జింగ్, మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్, ఇంటీరియర్ ఫుల్ బ్లాక్ కలర్‌లో థీమ్‌లో ఉంటుంది. వీటిలో డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ కార్ల ఫీచర్ల విషయానికి వస్తే.. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 10-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఏసీ, సన్‌రూఫ్ ఉన్నాయి.
ఈ స్టెల్త్ ఎడిషన్ వేరియంట్ల సేఫ్టీలో ప్రయాణీకుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా ఉన్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



