Tata Harrier EV: మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ.. ధర, రేంజ్, ఫీచర్లు వింటే షాకవ్వాల్సిందే

Tata Harrier EV
x

Tata Harrier EV: మార్కెట్లోకి టాటా హారియర్ ఈవీ.. ధర, రేంజ్, ఫీచర్లు వింటే షాకవ్వాల్సిందే

Highlights

Tata Harrier EV: మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. దాదాపు ప్రతి సెగ్మెంట్‌లోనూ టాటాకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.

Tata Harrier EV: మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ దూసుకెళ్తోంది. దాదాపు ప్రతి సెగ్మెంట్‌లోనూ టాటాకు ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో తన పట్టును మరింత గట్టిగా బిగించుకోవడానికి, టాటా కంపెనీ కొన్నాళ్ల క్రితం టాటా హారియర్ ఈవీని లాంచ్ చేసింది. లాంచ్ చేసేటప్పుడు, ఈ కారు ఎంట్రీ లెవల్ మోడల్ ధరను మాత్రమే చెప్పారు. కానీ, ఇప్పుడు హారియర్ ఈవీ రియర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న అన్ని వేరియంట్ల ధరలను కూడా అధికారికంగా ప్రకటించారు. ఇది మార్కెట్‌లో మహీంద్రా XUV 9e కి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది!


టాటా హారియర్ ఈవీలో ఐదు RWD (రియర్ వీల్ డ్రైవ్) ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అవి: Adventure S 65, Adventure 65, Fearless+ 75, Fearless+ 65, Empowered 75. ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ SUV ధర రూ. 21.49 లక్షల(ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుంది. ఈ కారు టాప్ వేరియంట్ కొనాలంటే రూ. 27.49 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కారు బుకింగ్స్ జులై 2 నుంచి మొదలవుతాయి.

ఈ ధరల్లో కారు ఛార్జర్ ఖర్చు, అలాగే దాన్ని ఇంట్లో ఏర్పాటు చేసే ఖర్చు (ఇన్‌స్టాలేషన్) కలపలేదు. AC ఫాస్ట్ ఛార్జర్ కోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వేరియంట్ల ధరలను జూన్ 27 న ప్రకటిస్తారు. ఈ ధరల రేంజ్‌లో హారియర్ ఈవీకి మహీంద్రా XUV 9e గట్టి పోటీ ఇస్తుంది. మహీంద్రా XUV 9e ధర రూ. 21.90 లక్షల నుంచి రూ. 30.50 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. 75kWh బ్యాటరీ ఉన్న వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. అయితే, రియల్ వరల్డ్ కండిషన్స్‌లో ఈ రేంజ్ 480 నుంచి 500 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చు. హారియర్ EV లోని రెండు బ్యాటరీలూ 120kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. హారియర్ ఈవీ టాప్ స్పీడ్ 180 కిలోమీటర్లు/గంట. ఇది కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

హారియర్ ఈవీలో 6 రకాల డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. కారు లోపల 14.5 అంగుళాల శాంసంగ్ నియో క్యూఎల్‌ఈడీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే లకు సపోర్ట్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories