Car Buying: కొత్త కారు కొనేముందు డబ్బు ఆదా చేయండి.. డీలర్‌ షిప్ మోసాలు కనిపెట్టండి..!

Save Money Before Buying a New Car Know Dealership Scams
x

Car Buying: కొత్త కారు కొనేముందు డబ్బు ఆదా చేయండి.. డీలర్‌ షిప్ మోసాలు కనిపెట్టండి..!

Highlights

Car Buying: మీరు కొత్త కారు కొనబోతున్నట్లయితే డీలర్‌షిప్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలని గమనించాలి.

Car Buying: మీరు కొత్త కారు కొనబోతున్నట్లయితే డీలర్‌షిప్‌కు వెళ్లే ముందు కొన్ని విషయాలని గమనించాలి. అప్పుడే అనవసర ఖర్చుల నుంచి బయటపడుతారు. దీని కోసం కొన్ని చిట్కాలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో డీలర్‌షిప్‌లు కస్టమర్ల నుంచి రకరకాలుగా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. అందుకే కొత్తకారు కొనేముందు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఈరోజు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ సెర్చ్‌

ముందుగా డీలర్‌షిప్‌కి వెళ్లే ముందు ఆన్‌లైన్ సెర్చ్‌ చేయండి. మీరు కొనుగోలు చేయబోయే కారుపై కంపెనీ ఎలాంటి ఆఫర్ అందిస్తుందో చెక్‌ చేయండి. కార్ కంపెనీలు ఎప్పటికప్పుడు ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి. వాటి గురించి ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఆఫర్ కింద తగ్గింపు ఇవ్వాలని డీలర్‌షిప్‌ను అడగండి. అప్పుడు ఎంతో కొంత మిగులుతుంది.

యాక్సెసరీస్ ప్యాకేజీ

డీలర్‌షిప్ వారు కారుతో కూడిన యాక్సెసరీస్ ప్యాకేజీని అందిస్తారు. ఇది చాలా ఖరీదుగా ఉంటుంది. ఈ యాక్సెసరీస్ ప్యాకేజీలో అందించే వస్తువులు బయటి మార్కెట్‌లో పొందినట్లయితే చౌకగా ఉంటాయి. ఇలాంటి సమయాలలో తెలివిగా ఆలోచిస్తే ఎంతో కొంత డబ్బు ఆదా చేస్తారు. కాబట్టి కొత్తకారు కొనేముందు యాక్సెసరీస్ ప్యాకేజీని తిరస్కరించండి.

బీమా

డీలర్‌షిప్ అందించే కారు బీమాకు కొంత మార్జిన్ ఉంటుంది. అయితే వారితో సంప్రదింపులు చేస్తే దానిని తీసేవేసే అవకాశం ఉంటుంది. ముందుగా కారు ఇన్సూరెన్స్‌లో ఎంత బీమా అందుబాటులో ఉందో తనిఖీ చేయండి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో పొందే బీమా ప్రీమియంతో సరిపోల్చండి. తక్కువగా వస్తే పర్వాలేదు లేదంటే బయట తీసుకోవడం ఉత్తమం.

పొడిగించిన వారంటీ

డీలర్‌షిప్‌లు అనేక అదనపు ఛార్జీలను కలిపి కారు ఆన్-రోడ్ ధరను తెలియజేస్తారు. ఇందులో పొడిగించిన వారంటీపై వేల రూపాయలు సంపాదిస్తారు. కారు కొనేటప్పుడు పొడిగించిన వారంటీని పొందకూడదనుకుంటే ఆన్-రోడ్ ధర నుంచి ఆ మొత్తాన్ని తీసివేయవచ్చు. ఇది ఎంతో కొంత డబ్బును ఆదా చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories