Revolt RV BlazeX: మార్కెట్‌ను షేక్ చేస్తున్న రివోల్ట్ ఈవీ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా..?

Revolt RV BlazeX
x

Revolt RV BlazeX: మార్కెట్‌ను షేక్ చేస్తున్న రివోల్ట్ ఈవీ బైక్.. మైలేజ్ ఎంతో తెలుసా..?

Highlights

Revolt RV BlazeX: రివోల్ట్ మోటార్స్ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా అవతరించింది. ఇటీవలే సరికొత్త ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్ ఈ-మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది.

Revolt RV BlazeX: రివోల్ట్ మోటార్స్ ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా అవతరించింది. ఇటీవలే సరికొత్త ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్ ఈ-మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇందులోని ఫీచర్స్, డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. రండి.. ఈ కొత్త బైక్ ఎలా ఉంటుందో అందులోని విశేషాలను తెలుసుకుందాం.

కొత్త రివోల్ట్ ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉంది. దీని ధర రూ.1.14 లక్షలు ఎక్స్-షోరూమ్. బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, ఈ నెల మొదటి వారం నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

కొత్త రివోల్ట్ ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్ ఈ-బైక్‌లో 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. పూర్తి ఛార్జింగ్ పై 150 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఇందులో ఉపయోగించే ఎలక్ట్రిక్ మోటార్ 4కిలోవాట్ గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్ట వేగం గంటకు 85 కి.మీ.

దీని బ్యాటరీ ప్యాక్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 0 నుండి 80 వరకు ఛార్జ్ చేయడానికి 80 నిమిషాలు పడుతుంది. హోమ్ ఛార్జర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాల సమయం సరిపోతుంది.

కొత్త రివోల్ట్ ఆర్‌వి బ్లేజ్‌ఎక్స్ ఈ-బైక్ అద్భుతమైన డిజైన్‌ అద్భుతంగా ఉంటుంది. రౌండ్ ఎలఈడీ హెడ్‌లైట్, పొడవైన సీటు ఉంది. స్టెర్లింగ్ సిల్వర్ బ్లాక్, ఎక్లిప్స్ రెడ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.

కొత్త రివోల్ట్ ఆర్‌వి బ్లేజ్‌ ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌లో డజన్ల కొద్దీ ఫీచర్స్ ఉన్నాయి. ఎల్‌సీడీ స్క్రీన్ (6-అంగుళాల), స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఓటీఏ అప్‌డేట్‌లతో సహా డజన్ల కొద్దీ ఫీచర్స్ చూడచ్చు. ఛార్జింగ్ కంపార్ట్‌మెంట్, స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ కింద ఉంటాయి.

కొత్త రివోల్ట్ ఆర్‌వి బ్లేజ్‌ ఎక్స్ ఈ-బైక్‌లో ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. రైడర్ భద్రత కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ అందించారు. రివోల్ట్ ఆర్‌వి బ్లేజ్‌ ఎక్స్ ధర రూ. 1.19 లక్షల నుండి రూ. 1.40 లక్షల మధ్య ఉంటుంది. 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షనల్. ఫుల్ ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లు నడుస్తుంది. గరిష్టంగా వేగం 85 kmph.

Show Full Article
Print Article
Next Story
More Stories