కోటిమందికి చేరువైన హోండా షైన్.. రూ. 5,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు..!

Honda Shine: హోండా కంపెనీకి చెందిన హోండా షైన్‌ బైక్‌ని ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా కస్టమర్లు కొనుగోలు చేశారు.

Arun Chilukuri
Updated on: 3 April 2022 6:00 PM IST
Pay Rs 5,999 and Take the Honda Shine Bike Home
X

కోటిమందికి చేరువైన హోండా షైన్.. రూ. 5,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు..!

Honda Shine: హోండా కంపెనీకి చెందిన హోండా షైన్‌ బైక్‌ని ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా కస్టమర్లు కొనుగోలు చేశారు. ఈ బైక్ అమ్మకాలను మరింత పెంచడానికి హోండా కంపెనీ ఈజీ ఫైనాన్స్‌లో అందిస్తుంది. కేవలం రూ.5,999 డౌన్‌పేమెంట్‌తో కొత్త హోండా షైన్‌ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ. 90,000. మీరు ఈ బైక్‌ను సులభమైన EMIలో కొనుగోలు చేయవచ్చు. హోండా షైన్ కోసం వినియోగదారులు 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 2,700 EMI చెల్లించాల్సి ఉంటుంది.

పనితీరులో అద్భుతం

కంపెనీ ప్రకారం 125సీసీ సెగ్మెంట్‌లో ఇలాంటి బైక్‌ను 10 మిలియన్ల మంది వినియోగదారులు కొనుగోలు చేశారు. 125 సిసి సెగ్మెంట్‌లో హోండా బెస్ట్ సెల్లింగ్ మోటార్‌సైకిల్ ఇదే. ఈ బైక్ పనితీరు పరంగా మెరుగైనది. వాస్తవానికి ఈ బైక్‌లో 123.94 CC సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, పవర్ కోసం SI ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 7500 RPM వద్ద 7.9 kW శక్తిని, 6000 RPMవద్ద 11 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

తేలికైన సరసమైన బైక్

హోండా షైన్ ఇండియన్ మార్కెట్లో 5 కలర్ ఆప్షన్లలో వస్తుంది. వీటిలో డిసెంట్ బ్లూ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, జెనీ గ్రే మెటాలిక్, రెబెల్ రెడ్ మెటాలిక్ ఉన్నాయి. అలాగే హోండా షైన్ పొడవు 2046 మిమీ, వెడల్పు 737 మిమీ, ఎత్తు 1116 మిమీ ఉంటుంది. దీని వీల్ బేస్ 1285 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm. ఇందులో 10.5 లీటర్ల సామర్థ్యం ఉన్న పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది.

అటువంటి ధర కోసం అటువంటి పనితీరు

మోటారు సైకిళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఇలాంటి సమయంలో ఈ బైక్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో దీని డ్రమ్ బ్రేక్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,943, ఇది డిస్క్ బ్రేక్ వేరియంట్‌పై రూ. 79,343గా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story