Oben Rorr EZ: ఒబెన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. నవంబర్ 7న లాంచ్

Oben Rorr EZ: ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త ఒబెన్ రోర్ ఇజెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 7న విడుదల చేయనుంది.

Oben Rorr EZ
X

Oben Rorr EZ

Oben Rorr EZ: ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ కొత్త ఒబెన్ రోర్ ఇజెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నవంబర్ 7న విడుదల చేయనుంది. ఈ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. కంపెనీ ఇప్పటికీ ఒబెన్ రోర్ ఇజెడ్ వివరాలను వెల్లడించలేదు. అయితే ఇది ఎల్‌ఎఫ్‌పి బ్యాటరీ టెక్నాలజీతో రోజువారీ మోటార్‌సైకిల్ అవుతుంది. ఆర్ అండ్ డీ నుండి బ్యాటరీ, మోటారు, వెహికల్ కంట్రోల్ యూనిట్, ఫాస్ట్ ఛార్జర్ వంటి క్లిష్టమైన భాగాల తయారీ వరకు ప్రతిదీ పూర్తిగా స్థానికంగా జరిగిందని కంపెనీ పేర్కొంది.

ఒబెరాన్ రోర్ గురించి మాట్లాడితే ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో 8kW పర్మినెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌గా ఉపయోగపడుతుంది. ఇది 4.4kWh బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఒబెరాన్ రోర్ బ్యాటరీ గురించి మాట్లాడితే LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీ టెక్నాలజీ ఇందులో ఉపయోగించారు. ఇతర EVలతో పోలిస్తే ఈ బ్యాటరీ రెట్టింపు జీవితకాలంతో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఒబెన్ రోర్ బ్యాటరీ ప్యాక్ 50 శాతం ఎక్కువ హీట్ రెసిస్టెన్స్, గణనీయంగా తక్కువ పర్యావరణ ప్రభావం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

ఒబెన్ ఎలక్ట్రిక్ బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వేగాన్ని అందుకోగలదు. ఇది 8-kW మోటార్ కలిగి ఉంది. ఇది 100 kmph గరిష్ట వేగాన్ని ఇస్తుంది. ఓబెన్ రోర్ ఫుల్ ఛార్జ్‌పై 187కిమీ (IDC రేంజ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 2 గంటల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఒబెరాన్ రోర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.50 లక్షలు. ఒబెన్ రోర్ EZ ధర ఓబెన్ రోర్ కంటే తక్కువగా ఉంటుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story