Nissan: ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదండోయ్.. 5 సీటర్ కారుపై బంఫర్ డిస్కౌంట్‌తోపాటు రూ. 1.35 లక్షల ప్రయోజనాలు..!

Benefits on Nissan Magnite: నిస్సాన్ మోటార్ ఇండియా వీకెండ్ కార్నివాల్‌ను ప్రారంభించింది. నిస్సాన్ కంపెనీ జూన్ 15 నుంచి 16 వరకు కార్నివాల్ నిర్వహించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 11 Jun 2024 10:16 AM IST
Nissan Magnite Discount Offers and Benefits Check Price and features
X

Nissan: ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదండోయ్.. 5 సీటర్ కారుపై బంఫర్ డిస్కౌంట్‌తోపాటు రూ. 1.35 లక్షల ప్రయోజనాలు

Benefits on Nissan SUV: నిస్సాన్ మోటార్ ఇండియా వీకెండ్ కార్నివాల్‌ను ప్రారంభించింది. నిస్సాన్ కంపెనీ జూన్ 15 నుంచి 16 వరకు కార్నివాల్ నిర్వహించనుంది. దేశంలోని అన్ని డీలర్‌షిప్‌లలో కంపెనీ ఈ కార్నివాల్‌ను ప్రారంభించింది. దీనితో పాటు, నిస్సాన్ NMIPL లాయల్టీ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది. దీని కింద నిస్సాన్ మాగ్నైట్‌పై రూ. 1,35,100 విలువైన ప్రయోజనాలు ఇవ్వనుంది.

నిస్సాన్ మాగ్నైట్‌లో లభించే ఈ ప్రయోజనాలు దాని MT XE, AMT XE వేరియంట్‌లకు కూడా లభిస్తాయి. ఈ కార్నివాల్ సందర్భంగా, కారును బుక్ చేసుకున్న యజమానులకు బహుమతులు, కార్‌కి సంబంధించింది గ్యాడ్జెట్స్ కూడా ఇవ్వనుంది. GEZA SE మోడల్స్ కోసం కంపెనీ కొన్ని ప్రయోజనాలు కూడా ప్రకటించింది. దీంతో పాటు లక్కీ డ్రా విజేతలకు కంపెనీ ఆఫర్లు ఇవ్వనుంది.

నిస్సాన్ విక్రయాలు ఎలా ఉన్నాయంటే?

కార్ల తయారీదారు నిస్సాన్ కంపెనీ ఇటీవల తన గత నెల అమ్మకాల నివేదికను విడుదల చేసింది. దీనిలో నిస్సాన్ మే 2024 అమ్మకాలలో విదేశీ మార్కెట్లో బంపర్ లాభాలను పొందిందని కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌లో కంపెనీ అమ్మకాలు క్షీణించాయి. నిస్సాన్ కంపెనీ మొత్తం విక్రయాల్లో 104 శాతం వృద్ధిని సాధించింది.

మే 2024లో కంపెనీ 6,204 యూనిట్లను విక్రయించింది. ఏప్రిల్ 2024లో 3,043 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది మే 2023తో పోలిస్తే, కంపెనీ 34 శాతం వృద్ధిని సాధించింది. మే 2023లో, నిస్సాన్ 4,631 యూనిట్లు విక్రయించింది.

నిస్సాన్ మాగ్నైట్ GEZA ఎడిషన్‌లో ప్రత్యేకత..

2024 నిస్సాన్ మాగ్నైట్ GEZA ఎడిషన్ 9-అంగుళాల HD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనితో పాటు, ఈ కారు వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఫీచర్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ నిస్సాన్ కారులో JBL స్పీకర్ సిస్టమ్ కూడా అందించారు. రియర్ వ్యూ కెమెరా ఫీచర్ కూడా ఈ కారుకు జోడించారు. నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5,99,900 నుంచి ప్రారంభమవుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story