Airbags: ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కారులో ఈ 4 పనులు ఎప్పుడూ చేయోద్దు.. ప్రమాదాలను కోరి తెచ్చుకున్నట్లే..!

Airbags: ఎయిర్‌బ్యాగ్స్ ఉన్న కారులో ఈ 4 పనులు ఎప్పుడూ చేయోద్దు.. ప్రమాదాలను కోరి తెచ్చుకున్నట్లే..!
x
Highlights

Cars Equipped With Airbags: ప్రస్తుతం కార్లలో భద్రతపై చాలా ఫోకస్ చేస్తున్నారు. దీని కోసం అనేక భద్రతా ఫీచర్లు అందిస్తున్నారు. వీటిలో ఎయిర్‌బ్యాగ్ కూడా ఒక కీలక ఫీచర్.

Cars Equipped With Airbags: ప్రస్తుతం కార్లలో భద్రతపై చాలా ఫోకస్ చేస్తున్నారు. దీని కోసం అనేక భద్రతా ఫీచర్లు అందిస్తున్నారు. వీటిలో ఎయిర్‌బ్యాగ్ కూడా ఒక కీలక ఫీచర్. భారతదేశంలోని అన్ని కార్లలో కనీసం రెండు ఎయిర్‌బ్యాగ్‌లను అందించడం తప్పనిసరిగా మారింది. అయితే, కార్ల తయారీదారులు రెండు ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తుంటారు. అయితే, ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న వాహనాల్లో, చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న కార్లలో మీరు చేయకూడని 4 విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బుల్ బార్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దు..

కొత్త కారులో బుల్ బార్‌ను అమర్చాలని ప్లాన్ చేస్తున్నారా.. అది ఇకపై కుదరదు. ఎందుకంటే బుల్ బార్‌ను ఇన్‌స్టాల్ చేయడం ఇప్పుడు చట్టవిరుద్ధం మాత్రమే కాదు.. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు విఫలమవడానికి కూడా కారణం కావచ్చు. ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్ సెన్సార్‌కు ప్రమాదం గురించి సమాచారం అందదు. దీని కారణంగా ఎయిర్‌బ్యాగ్‌లు ఓపెన్ కావు.

డ్యాష్‌బోర్డ్‌పై మీ పాదాలను ఉంచొద్దు..

చాలా మంది ముందు సీటులో కూర్చొని దూర ప్రయాణాల్లో తమ పాదాలను డాష్‌బోర్డ్‌పై ఉంచుతుంటారు. ముఖ్యంగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చిన కార్లలో ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్‌ను ఓపెన్ కాకుండా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యే సమయంలో కాళ్లను అక్కడే ఉంచడం వల్ల కాళ్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

డ్యాష్‌బోర్డ్‌లో వస్తువులను ఉండొద్దు..

ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చిన కార్లలో, డ్యాష్‌బోర్డ్‌లో ఏవైనా వస్తువులను ఉంచడం మానేయాలి. ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్ తెరవబడే పరిస్థితి ఏర్పడితే అది పేలిపోతుంది. అప్పుడే ఎయిర్‌బ్యాగ్ పెరుగుతుంది. ఈ సందర్భంలో, డ్యాష్‌బోర్డ్‌లో ఉన్న వస్తువులు హై-స్పీడ్ ప్రక్షేపకాలుగా మారే అవకాశం ఉంది. ఇవి మీకు మరింత ప్రాణాంతకమైన గాయాలను కలిగించవచ్చు.

పిల్లలు ఉన్నప్పుడు ఎయిర్‌బ్యాగ్‌ని ఆన్‌లో ఉంచొద్దు..

మీరు మీ పిల్లలను ముందు సీటులో తీసుకెళ్తుంటే, ప్రయాణీకుల వైపు ఎయిర్‌బ్యాగ్‌ని నిష్క్రియం చేయాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్ తెరుచుకునే శక్తిని పిల్లవాళ్లు ఆపలేదు. అది పిల్లల సామర్థ్యం కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories