Best Mileage Bikes: 70 కి.మీల కంటే ఎక్కువ మైలేజీ.. ఫీచర్లలోనూ అదుర్స్.. దేశంలో టాప్ 10 బైక్‌లు ఇవే..!

More Than 70 km Mileage With Best Features Check These Top 10 Bikes in India
x

Best Mileage Bikes: 70 కి.మీల కంటే ఎక్కువ మైలేజీ.. ఫీచర్లలోనూ అదుర్స్.. దేశంలో టాప్ 10 బైక్‌లు ఇవే..!

Highlights

Best Mileage Bikes In India: పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులకు ఎప్పుడూ ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100లు దాటింది. ఢిల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు వరుసగా రూ.96.70, రూ.106.31గా ఉన్నాయి.

Top 10 Best Mileage Bikes: పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులకు ఎప్పుడూ ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100లు దాటింది. ఢిల్లీ, ముంబైలలో పెట్రోల్ ధరలు వరుసగా రూ.96.70, రూ.106.31గా ఉన్నాయి. ఇప్పుడు, భారతదేశంలో అత్యధిక జనాభా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నందున, పెరిగిన పెట్రోల్ ధర కూడా చాలా మందిని ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో బైక్ రన్నింగ్ కాస్ట్ పెరగడంతో బైక్ నడిపేవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

అటువంటి పరిస్థితిలో, అధిక మైలేజీ ఉన్న బైక్ కొనుగోలు చేస్తే, బైక్ రన్నింగ్ ఖర్చును తగ్గించవచ్చు. కాబట్టి, దేశంలోని ఇటువంటి 10 బైక్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి అధిక మైలేజీని అందిస్తాయి. చాలా సులభమైన డిజైన్‌ను కలిగి ఉంటాయి. వీటిని ప్రజలు ఎంతో ఇష్టపడుతున్నారు.

టాప్ 10 మైలేజ్ బైక్‌లు..

-- బజాజ్ ప్లాటినా 100: మైలేజ్- 72 kmpl, ధర- రూ. 63,130 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- TVS స్పోర్ట్: మైలేజ్- 70 kmpl, ధర- రూ. 63,950 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- బజాజ్ ప్లాటినా 110: మైలేజ్- 70 kmpl, ధర- రూ. 69,216 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- బజాజ్ CT 110: మైలేజ్- 70 kmpl, ధర- రూ. 66,298 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- TVS స్టార్ సిటీ ప్లస్: మైలేజ్- 68 kmpl , ధర- రూ 72,305 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- హోండా SP 125: మైలేజ్- 65 kmpl, ధర- రూ 82,486 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- Hero HF డీలక్స్: మైలేజ్- 65 kmpl, ధర- రూ. 59,890 (ఎక్స్-షోరూమ్ , ఢిల్లీ)

-- TVS రేడియన్: మైలేజ్- 65 kmpl, ధర- రూ. 59,925 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- హోండా CD 110 డ్రీమ్: మైలేజ్- 65 kmpl, ధర- రూ. 70,315 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

-- హీరో స్ప్లెండర్ ప్లస్: మైలేజ్- 60 kmpl, ధర- రూ 72,728 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Show Full Article
Print Article
Next Story
More Stories