MG Windsor Pro booking: బుకింగ్స్ షురూ.. విండ్సర్ ఈవీ ప్రో కొనేయండి.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్..!

MG Windsor Pro booking: ఎంజీ మోటార్ మే 6న విండ్సర్ ఈవీ ప్రోను ప్రారంభించింది. దేశంలోనే నంబర్-1 ఎలక్ట్రిక్ కారు బుకింగ్ మే 8న ప్రారంభమైంది. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ డీలర్‌షిప్‌, అధికారిక వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు.

Vamsi Krishna
Published on: 11 May 2025 5:57 AM IST
MG Windsor Pro booking
X

MG Windsor Pro booking: బుకింగ్స్ షురూ.. విండ్సర్ ఈవీ ప్రో కొనేయండి.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్..!

MG Windsor Pro booking: ఎంజీ మోటార్ మే 6న విండ్సర్ ఈవీ ప్రోను ప్రారంభించింది. దేశంలోనే నంబర్-1 ఎలక్ట్రిక్ కారు బుకింగ్ మే 8న ప్రారంభమైంది. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ కారును కంపెనీ డీలర్‌షిప్‌, అధికారిక వెబ్‌సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షలు. ఇది విండ్సర్ లైనప్‌లో టాప్ వేరియంట్ కూడా. ఎంజీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్‌ను ఎంచుకునే కస్టమర్ల కోసం, విండ్సర్ ఈవీ ప్రో ధర రూ. 12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

MG Windsor Pro Range

విండ్సర్ ఈవీ ప్రో 52.9కిలోవాట్ LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.స్టాండర్డ్ విండ్సర్ ఈవీ 38కిలోవాట్ LFP బ్యాటరీకి ARAI- ధృవీకరించిన 332కి.మీ పరిధితో పోలిస్తే, ప్రో 449కిమీ రేంజ్ అందిస్తుంది. విండ్సర్ ఈవీ ప్రో పవర్ అవుట్‌పుట్ 136హెచ్‌పి, 200ఎన్ఎమ్ వద్ద టార్క్ అవుట్‌పుట్ వద్ద స్టాండర్ట్ మోడల్ వలెనే ఉంటుంది. ఛార్జింగ్ కోసం, విండ్సర్ ఈవీ ప్రో 7.4కిలోవాట్ ఏసీ ఛార్జర్‌తో వస్తుంది, ఇది బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 9.5 గంటలు పడుతుంది. 60kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఉంది. 50 నిమిషాల్లో 20 నుండి 80శాతం ఛార్జింగ్‌ చేయచ్చు.

MG Windsor Pro Features

విండ్సర్‌లో పెద్ద కాస్మెటిక్ మార్పులు ఏవీ చేయలేదు. ఇది ఎంజీ హెక్టర్ ఎస్‌యూవీ లాగా కనిపించే 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కోసం కొత్త డిజైన్ అప్‌డేట్‌ను మాత్రమే పొందుతుంది. మరోవైపు, విండ్సర్ ఈవీ ప్రోలో ప్రస్తుత మోడల్ మాదిరిగానే స్టైలింగ్ అంశాలు ఉన్నాయి. వీటిలో ముందు , వెనుక భాగంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ లైట్‌బార్‌లతో స్ప్లిట్ హెడ్‌లైట్ సెటప్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పెద్ద విండో ఏరియా , విలక్షణమైన ఎంపీవీ-హ్యాచ్‌బ్యాక్ హైబ్రిడ్ ఫారమ్ ఫ్యాక్టర్ ఉన్నాయి. ఈ బ్రాండ్ సెలాడాన్ బ్లూ, గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్ అనే 3 కొత్త కలర్స్‌లో లాంచ్ అయింది. ప్రో బూట్ స్పేస్ 579 లీటర్లు. స్టాండర్డ్ విండ్సర్‌లో 604 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది.

MG Windsor Pro Interior

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రూఫ్, కాలమ్ లైనర్‌లపై కొత్త లేత గోధుమరంగు అప్హోల్స్టరీ. ఇది ప్రస్తుత మోడల్ పూర్తి బ్లాక్ కలర్ ఇంటీరియర్ కలర్ స్కీమ్‌కి భిన్నంగా ఉంటుంది. విండ్సర్ ఈవీ ప్రో V2V (వాహనం నుండి వాహనం) V2L (వాహనం నుండి లోడ్) యాక్టివిటీ వంటి కొన్ని ముఖ్యమైన కొత్త ఫీచర్స్‌తో కూడా వస్తుంది, ఇక్కడ బ్యాటరీని ఇతర ఎలక్ట్రిక్ కార్లు, గ్యాడ్జెట్లను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు. ఇందులో లెవల్ 2 అడాస్ సేఫ్టీ సూట్, పవర్డ్ టెయిల్‌గేట్‌ కూడా ఉన్నాయి.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story