MG Majestor : గ్లోస్టర్ కంటే స్మార్ట్.. ఫీచర్లలో కింగ్..ఇక టాటా సఫారి, ఎక్స్‌యూవీ 700లకు చుక్కలే

MG Majestor : గ్లోస్టర్ కంటే స్మార్ట్.. ఫీచర్లలో కింగ్..ఇక టాటా సఫారి, ఎక్స్‌యూవీ 700లకు చుక్కలే
x
Highlights

గ్లోస్టర్ కంటే స్మార్ట్.. ఫీచర్లలో కింగ్..ఇక టాటా సఫారి, ఎక్స్‌యూవీ 700లకు చుక్కలే

MG Majestor : ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ మెజెస్టర్‎ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరి 12న గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఈ కారును ఇప్పటికే సీక్రెట్ గా టెస్టింగ్ చేస్తుండగా పలుమార్లు కెమెరాకు చిక్కింది. ఇది చూడ్డానికి చాలా భారీగా, మజిక్యులర్‌గా కనిపిస్తోంది. పెద్ద ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, వెడల్పాటి బంపర్‌తో దీని లుక్ చాలా బోల్డ్‌గా ఉంది. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే.. పెద్ద అలాయ్ వీల్స్, బాక్సీ డిజైన్, పొడవైన వీల్‌బేస్ కారణంగా ఈ కారు రోడ్డుపై తిరుగుతుంటే ఒక రాజసం ఉట్టిపడుతుంది.

కారు లోపలి భాగం ఒక విలాసవంతమైన గదిని తలపిస్తుంది. ఇందులో మూడు వరుసల సీటింగ్ ఉంటుంది. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ప్రీమియం సౌకర్యాలు ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తాయి. భద్రత విషయంలో కూడా ఎంజీ ఎక్కడా తగ్గలేదు. ఇందులో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ తో పాటు మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించనున్నారు.

మెజెస్టర్‌లో ఎంజీ ఇంటర్నేషనల్ మోడల్స్ నుంచి తీసుకున్న 2.0 లీటర్ పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. 7-సీటర్ లేఅవుట్‌తో వచ్చే ఈ కారులో మిడిల్ రో (రెండో వరుస)లో కెప్టెన్ సీట్ల ఆప్షన్ కూడా ఉండొచ్చు. ప్రయాణికుల కంఫర్ట్ కోసం సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, ఎర్గోనామిక్ సీటింగ్ డిజైన్‌ను ఎంజీ ప్రాధాన్యతగా తీసుకుంది. వెనుక వరుస సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా భారీ బూట్ స్పేస్‌ను కూడా పొందవచ్చు.

ఎంజీ మెజెస్టర్ ధర రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది మార్కెట్లో ఇప్పటికే పాపులర్ అయిన మహీంద్రా XUV700, టాటా సఫారి, హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా స్కార్పియో-ఎన్ వంటి కార్లకు గట్టి పోటీనివ్వబోతోంది. గ్లోస్టర్ కంటే శక్తివంతంగా, హెక్టర్ కంటే స్టైలిష్‌గా ఉండబోతున్న ఈ కారు ఎస్‌యూవీ ప్రేమికులకు ఒక పండగే అని చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories