Maruti: మారుతి నుండి కొత్త ఎస్‌యూవీ.. విటారా కంటే తక్కువ ధర.. బ్రెజా కంటే పెద్ద సైజు

Maruti
x

Maruti: మారుతి నుండి కొత్త ఎస్‌యూవీ.. విటారా కంటే తక్కువ ధర.. బ్రెజా కంటే పెద్ద సైజు

Highlights

Maruti: మారుతి సుజుకి నుండి రాబోతున్న కొత్త 5-సీటర్ ఎస్‌యూవీ భారత ఆటో రంగంలో పెద్ద సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త ఎస్‌యూవీ హుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Maruti: మారుతి సుజుకి నుండి రాబోతున్న కొత్త 5-సీటర్ ఎస్‌యూవీ భారత ఆటో రంగంలో పెద్ద సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త ఎస్‌యూవీ హుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మిడ్‌సైజ్ ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది మారుతి ఇప్పటికే ఉన్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా కంటే తక్కువ ధరకే లభించనుంది. గ్రాండ్ విటారా కేవలం నెక్సా షోరూమ్‌ల ద్వారా మాత్రమే అమ్ముడవుతుండగా, ఈ కొత్త ఎస్‌యూవీ ఎరీనా డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా అమ్ముడవుతుంది. ఇది 2025 దీపావళి సీజన్‌లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, కంపెనీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ ఎస్‌యూవీ కోడ్‌నేమ్ Y17. దీనికి ఎస్క్యూడో అనే పేరు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే ఈ పేరును ట్రేడ్‌మార్క్ చేసుకుంది. మారుతి ఎస్‌యూవీ లైనప్‌లో ఇది బ్రెజా కంటే పైన, గ్రాండ్ విటారా కంటే కింద ఉంటుంది. అంటే, దీని ధర బ్రెజా కంటే కొద్దిగా ఎక్కువ.. కానీ గ్రాండ్ విటారా కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడల్స్ మధ్య ధర పరిధిలో ఇది ఉండవచ్చు.

డిజైన్, ఇంటీరియర్ విషయానికి వస్తే, కొత్త మారుతి ఎస్క్యూడో లుక్ చాలావరకు గ్రాండ్ విటారాను పోలి ఉంటుంది. అయితే, ఇందులో కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉండకపోవచ్చు. సైజు పరంగా ఈ ఎస్‌యూవీ బ్రెజా కంటే పెద్దదిగా, గ్రాండ్ విటారా కంటే కొద్దిగా పొడవుగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, గ్రాండ్ విటారా కంటే ఎక్కువ బూట్ స్పేస్ కూడా లభించవచ్చు.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఇవ్వవచ్చు. ఇది మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సెటప్ దాదాపు 103 బీహెచ్‌పీ పవర్ అందిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభిస్తాయి. ఈ కొత్త ఎస్‌యూవీలో గ్రాండ్ విటారా మాదిరిగా స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది, ఎందుకంటే దాని తయారీ ఖర్చు ఎక్కువ. అంతేకాకుండా, నెక్సా , ఎరీనా ఎస్‌యూవీ సెగ్మెంట్‌లలో తేడా చూపించడానికి కూడా ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. గ్రాండ్ విటారాలోని హైబ్రిడ్ వెర్షన్ టయోటా 1.5L అట్కిన్‌సన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 79 బీహెచ్‌పీ, 141Nm టార్క్ అందిస్తుంది. ఇందులో కేవలం ఇ-సీవీటీ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories