Maruti Suzuki Offers: ఆ 7 సీటర్ మారుతి కారుపై ఆఫర్ల జాతర.. నమ్మలేని విధంగా తగ్గింపులు..!

Maruti Suzuki Offers: మారుతి సుజికి లగ్జరీ ఎమ్‌పివి ఇన్విక్టోపై ఈ నెలలో మొదటిసారిగా రూ.30 వేల క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2024 4:24 PM IST
maruti suzuki invicto
X

maruti suzuki invicto

Maruti Suzuki Offers: మారుతి సుజికి ఇండియా తన అత్యంత ఖరీదైన లగ్జరీ ఎమ్‌పివి ఇన్విక్టోపై ఈ నెలలో మొదటిసారిగా భారీ ఆఫర్ తీసుకొచ్చింది. నివేదిక ప్రకారం కంపెనీకి చెందిన కంతమంది డీలర్లు ఈ నెలలో ఈ కారుపై రూ.30 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాకుండా కంపెనీ రూ.25 వేలు ఎక్స్‌ఛేంజ్ భోనస్ కూడా ఇస్తోంది. అయితే కస్టమర్లు పాత ఎర్టిగా, ఎక్స్‌ఎల్‌6 లేదా టూర్ ఎంపై మాత్రమే ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ పొందుతారు. ఆఫర్ అక్టోబర్ 12 అంటే దసరా వరకు అందుబాటులో ఉంటుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.25.21 లక్షల నుండి రూ.28.92 లక్షల వరకు ఉంది.

మారుతి ఇన్విక్టో ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టమ్‌తో 2.0 లీటర్ TNGA ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది E-CVT గేర్‌బాక్స్‌కు కనెక్ట్ చేయబడింది. ఇది 183 హెచ్‌పి పవర్, 1250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 9.5 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఒక లీటర్ పెట్రోల్‌లో దీని మైలేజ్ 23.24 కిమీ వరకు ఉంది. టయోటా ఇన్నోవా లాగా, ఇది కూడా 7 సీట్ల కాన్ఫిగరేషన్‌లో వస్తుంది.

ఇది మస్క్యులర్ క్లామ్‌షెల్ బానెట్, DRLతో సొగసైన LED హెడ్‌లైట్‌లు, క్రోమ్ చుట్టూ ఉన్న షట్కోణ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లను పొందుతుంది. క్యాబిన్‌లో డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, లెదర్ అప్హోల్స్టరీతో కూడిన పవర్డ్ ఒట్టోమన్ సీట్లు, ఇంటిగ్రేటెడ్ మూడ్ లైటింగ్‌తో కూడిన పనోరమిక్ సన్‌రూఫ్, మల్టీ జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి.

మారుతి సుజుకి ఇన్విక్టోలో వన్ టచ్ పవర్ టెయిల్‌గేట్ అందుబాటులో ఉంటుంది. అంటే టెయిల్‌గేట్ ఒక్క టచ్‌తో ఓపెన్ అవుతుంది. ఇది కంపెనీ తదుపరి తరం సుజుకి కనెక్ట్‌తో పాటు భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. దీని పొడవు 4755mm, వెడల్పు 1850mm, ఎత్తు 1795mm. ఇది 8 వే అడ్జెస్ట్ చేయగల పవర్ వెంటిలేటెడ్ సీట్లు కలిగి ఉంది. ముందు సీట్లు, రెండవ వరుసలో కెప్టెన్ సీట్లు, సైడ్ ఫోల్డబుల్ టేబుల్, మూడవ వరుసకు సులభంగా యాక్సెస్ కోసం వన్ టచ్ వాక్ ఇన్ స్లయిడ్, మల్టీ జోన్ టెంపరేచర్ సెట్టింగ్‌లు ఉన్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story