Maruti Suzuki Fronx Hybrid: తగ్గేదేలే.. భారీ మైలేజీతో వస్తున్న మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌

Maruti Suzuki Fronx to come with hybrid technology and mileage over 30 kmpl
x

తగ్గేదేలే.. భారీ మైలేజీతో వస్తున్న మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌

Highlights

Maruti Suzuki Fronx Hybrid: మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కార్లను హైబ్రిడ్ వేరియంట్‌లలో అందిస్తోంది. ఈ టెక్నాలజీని టయోటా...

Maruti Suzuki Fronx Hybrid: మారుతి సుజుకి ఇప్పటికే గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి కార్లను హైబ్రిడ్ వేరియంట్‌లలో అందిస్తోంది. ఈ టెక్నాలజీని టయోటా మారుతికి అందించింది. అలానే సుజుకి ఇప్పుడు సొంతంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై పని చేస్తోంది. దీని ప్రభావం భవిష్యత్తులో దాదాపు అన్ని వాహనాలపై కనిపిస్తుంది. ఇది మారుతి ఫ్రాంక్స్‌తో పాటు స్విఫ్ట్‌తో కూడా ప్రారంభం కావచ్చు. ఇటీవల మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ బ్యాడ్జ్‌తో టెస్టింగ్‌లో కనిపించింది.

ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్‌లో టెస్టింగ్ సమయంలో మారుతి ఫ్రాంక్స్ హైబ్రిడ్ రోడ్లపై రయ్యుమని దూసుకుపోతూ కనిపించింది. వెనుక భాగంలో 'హైబ్రిడ్' బ్యాడ్జ్ పైన కుడి వైపున 'ఫ్రాంక్స్' బ్యాడ్జ్ కనిపిస్తోంది. మారుతి సుజుకి డెవలప్ చేస్తున్న హైబ్రిడ్ సెటప్‌ను కొత్త Z12E ఇంజిన్‌తో ఉంటుంది. ఈ ఇంజిన్‌ను ఇప్పటికే కొత్తగా వస్తోన్న స్విఫ్ట్‌ మోడల్స్‌లో అందించారు.

మారుతి కార్ల హైబ్రిడ్ వ్యవస్థ గ్రాండ్ విటారా, ఇన్విక్టో వంటి ప్రస్తుత మోడల్స్ తో పోల్చుకుంటే ఇది కొంచెం భిన్నంగా ఉండే అవకాశాలున్నాయి. ఇది రేంజ్ ఎక్స్‌టెండర్ సిస్టమ్ అవుతుంది. ఇది బ్యాటరీ ప్యాక్‌ను రీఛార్జ్ చేయడానికి పెట్రోల్ పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగిస్తుంది. వీల్స్‌కి పెట్రోల్ ఇంజిన్ నుండి కాకుండా ఎలక్ట్రిక్ మోటారు నుండి పవర్ అందుకుంటుంది. ఈ బలమైన హైబ్రిడ్ వ్యవస్థను తదుపరి తరం బాలెనో వంటి కొత్త మోడళ్లలో కూడా తీసుకురావచ్చు.

మారుతి సుజికి ఫ్రాంక్స్‌లో హైబ్రిడ్ సెటప్‌ తర్వాత చక్రాలు పెట్రోల్ ఇంజిన్‌కు బదులుగా ఎలక్ట్రిక్ మోటారు నుండి రన్ అవుతాయి. ఈ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ బ్యాటరీ ప్యాక్‌ను రీఛార్జ్ చేయడానికి జనరేటర్‌గా పనిచేస్తుంది. దీని కారణంగా ఇది మునుపటి కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది, అలాగే మెరుగైన ఇంధన సామర్థ్యాన్నిఆఫర్ చేస్తుంది.

మారుతి సుజికి ఫ్రాంక్స్ హైబ్రిడ్‌ ఒక లీటరు పెట్రోల్‌తో 30 కిమీ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది 1.2-లీటర్ K-సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. 89.73 పిఎస్ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్‌తో 21.79 కెఎమ్‌పిఎల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌తో 22.89 కెఎమ్‌పిఎల్ వరకు మైలేజీని ఇస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories