7 Seater Maruti Grand Vitara: అదిరే ఫీచర్లతో గ్రాండ్‌ విటారా నయా వెర్షన్‌.. పెద్ద ఫ్యామిలీల కోసం పర్‌ఫెక్ట్‌ కారు.. హ్యూందాయ్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్..!

7 Seater Maruti Grand Vitara
x

7 Seater Maruti Grand Vitara: అదిరే ఫీచర్లతో గ్రాండ్‌ విటారా నయా వెర్షన్‌.. పెద్ద ఫ్యామిలీల కోసం పర్‌ఫెక్ట్‌ కారు.. హ్యూందాయ్‌కు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్..!

Highlights

7 Seater Maruti Grand Vitara: కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి ఇప్పుడు దాని ఫేమస్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా 7 సీట్ల మోడల్‌ను తీసుకువస్తోంది.

7 Seater Maruti Grand Vitara: కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుతి సుజుకి ఇప్పుడు దాని ఫేమస్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా 7 సీట్ల మోడల్‌ను తీసుకువస్తోంది. కానీ దీని గురించి కంపెనీ నుండి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు, కానీ ఇటీవల గ్రాండ్ విటారా 7-సీట్ల వెర్షన్ దేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించింది, దీని ప్రకారం ఈ సంవత్సరం చివరి నాటికి గ్రాండ్ విటారా 7-సీట్ల మోడల్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత మోడల్ 5 సీట్ల వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే గ్రాండ్ విటారా 7-సీటర్‌లో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో తెలుసుకుందాం.

7 Seater Maruti Grand Vitara Design

మారుతి గ్రాండ్ విటారా 7-సీటర్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌లో కొన్ని చిన్న మార్పులను చూడచ్చు. ఇది ప్రస్తుతం ఉన్న 5 సీట్ల కంటే కొద్దిగా భిన్నంగా ఉండచ్చు. దీనిలో ఎలిజెంట్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో హెడ్‌లైట్లు ఉంటాయి. ఇందులో టెయిల్ లైట్లు కనెక్ట్ చేసి ఉంటాయి. దీని ముందు, వెనుక బంపర్‌లను తిరిగి డిజైన్ చేయచ్చు, ఇది మునుపటి కంటే బోల్డ్‌గా కనిపిస్తుంది. ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే, కొత్త మోడల్‌లో కొత్త డాష్‌బోర్డ్ కనిపిస్తుంది.

7 Seater Maruti Grand Vitara Features

అదే సమయంలో, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్‌ను ఫీచర్‌లుగా ఇవ్వచ్చు. దీనితో పాటు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో ఏసీ వంటి ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

7 Seater Maruti Grand Vitara Safety Features

సేఫ్టీ కోసం విటారా 7-సీటర్లలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించచ్చు. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే, గ్రాండ్ విటారా 7-సీటర్ ఇప్పటికే ఉన్న 5-సీటర్ మోడల్‌‌లో ఉన్న అదే ఇంజిన్‌ను కూడా పొందచ్చు. ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త మోడల్‌ను విడుదల చేయవచ్చు. దీని ధర దాదాపు రూ. 12-14 లక్షలు ఉండవచ్చు. ఇది హ్యుందాయ్ అల్కాజార్‌తో నేరుగా పోటీ పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories