Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి  'ఇ విటారా' బుకింగ్స్ స్టార్ట్.. రూ.25 వేలకే ఆర్డర్ చేయచ్చు..!

Maruti Suzuki e Vitara Bookings Now Open
x

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి  'ఇ విటారా' బుకింగ్స్ స్టార్ట్.. రూ.25 వేలకే ఆర్డర్ చేయచ్చు..!

Highlights

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఇండియా నంబర్ 1 కార్ల తయారీ కంపెనీ. దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది.

Maruti Suzuki e Vitara: మారుతి సుజుకి ఇండియా నంబర్ 1 కార్ల తయారీ కంపెనీ. దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. ఇటీవల ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కంపెనీ సరికొత్త 'ఇ విటారా' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఈ కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇ విటారాలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉంటాయి. అతి త్వరలో ఈ కారు సేల్స్ ప్రారంభం కానున్నాయి. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మారుతి కొన్ని ఎంపిక చేసిన షోరూమ్‌ల ద్వారా కొత్త ఇ విటారా ఎస్‌యూవీ అనఫిషియల్ బుకింగ్స్ ప్రారంభించింది. కస్టమర్‌లు ముందుగా రూ.25,000 టోకెన్ అమోంట్ చెల్లించి ఈ కారును ఆర్డర్ చేయచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ.17 లక్షల నుండి రూ.22.50 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త మారుతి సుజికి ఇ విటారా ఎస్‌‌యూవీ ఎక్స్‌టీరియర్ డిజైన్ చాలా అట్రాక్ట్ చేస్తుంది. అందులో చూడచక్కని ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, స్పోర్టీ వై షేప్ ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లు, ఫాగ్ లైట్లు, 3 పీస్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. కారు పొడవు 4,275 మిమీ, వెడల్పు 1,800 మిమీ, ఎత్తు 1,635 మిమీ. 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, 2,700 మీటర్ల పొడవైన వీల్‌బేస్‌ ఉంది. విటారాను నెక్సా బ్లూ, గ్రాండియర్ గ్రే, స్ప్లెండిడ్ సిల్వర్, ఆర్కిటిక్ వైట్, ఓపులెంట్ రెడ్, బ్లూయిష్ బ్లాక్‌తో సహా పలు ఆకర్షణీయమైన కలర్స్‌లో చూడచ్చు.

కొత్త మారుతి సుజుకి ఇ విటారాలో రెండు బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ (మైలేజీ) ఇస్తుంది. కారులోని మొదటి 49 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ 144 పిఎస్ హార్స్ పవర్, 192.5 న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. రెండో 61 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌ 174 పిఎస్ హార్స్ పవర్, 192.5 న్యూటన్ మీటర్ పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ కారులో 5 సీట్లు ఉంటాయి.

కొత్త మారుతి సుజుకి ఇ విటారా ఫీచర్లలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.1 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటో ఏసీ, యాంబియంట్ లైటింగ్, 10 వే పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్‌ ఉన్నాయి. భద్రత పరంగా 7-ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, డిస్క్ బ్రేక్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, 360-డిగ్రీ కెమెరా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories