Maruti Brezza Offers: నంబర్ వన్ ఎస్‌యూవీపై భలే ఆఫర్లు.. రూ.42 వేల డిస్కౌంట్.. ఇంకా చాలా ఉన్నాయ్..!

Maruti Brezza Offers: మారుతి బ్రెజ్జా ఎస్‌యూవీపై రూ.42 వేల డిస్కౌంట్ ప్రకటించింది. అలానే ఎక్స్‌ఛేంజ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2024 6:13 PM IST
Maruti Brezza Offers
X

Maruti Brezza Offers

Maruti Brezza Offers: దేశంలో పండుగల హడావుడి మొదలైంది. వినాయకచవితితో మొదలు పెడితే దసరా, దీపావళి వరకు అంతటా పండుగ శోభ వెల్లివిరిస్తుంది. ఈ క్రమంలో వివిధ కంపెనీలు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఫెస్టివల్ సేల్స్‌ ప్రకటించాయి. ఇదే ట్రెండ్ వాహన రంగంలో కొనసాగుతుంది. కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజికి నంబర్ ఎస్‌యూవీ బ్రెజ్జాపై ఆఫర్ల జాతరను షురూ చేసింది. ఈ కారు దేశంలోనే నంబర్ 1గా నిలవడం ఇదే మొదటిసారి. బ్రెజ్జా అర్బానో ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. కాబట్టి మీరు ఈ నెలలో కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తే మంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఈ SUVపై కంపెనీ 42,000 రూపాయల వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ డిస్కౌంట్ క్యాష్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూపంలో అందుబాటులో ఉంటుంది.

Brezza Zxi, Zxi+పై కంపెనీ రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ విధంగా ఈ రెండు వేరియంట్లపై రూ.25 వేల బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. మరోవైపు, బ్రెజ్జా అర్బానో ఎడిషన్ Lxi వేరియంట్‌పై రూ. 27 వేలు, Vxi వేరియంట్‌పై రూ. 15 వేల నగదు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇది కాకుండా దానిపై రూ. 15 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. బ్రెజ్జా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.34 లక్షలు.

Maruti Brezza Specifications
బ్రెజ్జాలో కొత్త జనరేషన్ K-సిరీస్ 1.5-డ్యూయల్ జెట్ WT ఇంజన్ ఉంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. ఈ ఇంజన్ 103hp పవర్ 137Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇంధన సామర్థ్యం కూడా పెరిగిందని కంపెనీ పేర్కొంది. కొత్త బ్రెజ్జా మాన్యువల్ వేరియంట్ 20.15 kp/l మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 19.80 kp/l మైలేజీని ఇస్తుంది.

ఇందులో 360 డిగ్రీల కెమెరా ఉంది. ఈ కెమెరా చాలా హైటెక్, మల్టీ-ఇన్ఫర్మేషన్ ఇచ్చే కెమెరా. ఈ కెమెరా కారు 9 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడుతుంది. దీనిని సుజుకి, టయోటా రెండూ సంయుక్తంగా తయారు చేశాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా ప్రత్యేకత ఏమిటంటే కారు లోపల కూర్చున్నప్పుడు, మీరు స్క్రీన్‌పై కారు చుట్టూ ఉన్న విజువల్స్ చూడగలుగుతారు.

మొట్టమొదటిసారిగా కారులో వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్ కూడా అందించారు. ఈ డాక్ సహాయంతో మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను వైర్‌లెస్‌గా సులభంగా ఛార్జ్ చేయగలరు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. అదే సమయంలో వేడిని నివారించడానికి పూర్తి భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. మారుతి అనేక కనెక్టింగ్ ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇది ఈ కాంపాక్ట్ SUVని చాలా విలాసవంతమైన, అధునాతనమైనదిగా చేస్తుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story