కారు కొనాలనుకునేవారికి శుభవార్త.. మారుతి కార్లపై రూ.40,000 వరకు తగ్గింపు..

Maruti Suzuki: కారు కొనాలనుకునేవారికి ఇది గుడ్‌ న్యూస్ అని చెప్పాలి.

Arun Chilukuri
Published on: 8 March 2022 5:29 PM IST
Maruti Best Offers  Rs 40,000 discount from Wagoner to Alto
X

కారు కొనాలనుకునేవారికి శుభవార్త.. మారుతి కార్లపై రూ.40,000 వరకు తగ్గింపు..

Maruti Suzuki: కారు కొనాలనుకునేవారికి ఇది గుడ్‌ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫేమస్‌ కార్ల కంపెనీ మారుతి సుజుకి బంపర్ డిస్కౌంట్లని ప్రకటించింది. మారుతి వ్యాగనర్ నుంచి ఆల్టో వరకు దాదాపు రూ.41, 000 వరకు తగ్గింపు ఆఫర్లని ఇస్తుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే వివిధ మోడళ్లపై డిస్కౌంట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అందులో మారుతి సుజుకి వ్యాగనర్ డిస్కౌంట్‌ అందరిని ఆకర్షిస్తుంది. కంపెనీ ఇటీవల వ్యాగన్ఆర్‌ను 2 కొత్త ఇంజన్ ఎంపికలు, కొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. ఈ పరిస్థితిలో పాత మోడల్స్ మిగిలిన స్టాక్‌లు ₹ 41000 వరకు తగ్గింపుతో అమ్ముతున్నారు. 1.2 లీటర్ వేరియంట్‌పై ₹ 41000, 1.0 లీటర్ వేరియంట్‌పై ₹ 31000 తగ్గింపు ప్రకటించారు.

మారుతి సుజుకి ఆల్టో

CNG ఎంపికలో 796cc ఇంజన్, 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో ఉన్న ఆల్టో పెట్రోల్‌తో అందుబాటులో ఉంది. మారుతి ఆల్టో బేస్ వేరియంట్ ధర రూ.3.25 లక్షలు. మారుతి ఆల్టో కారుపై రూ. 31,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. అయితే బేస్ వేరియంట్‌పై కేవలం 11,000 తగ్గింపు మాత్రమే అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో

మారుతి ఆల్టో మాదిరి ఎస్-ప్రెస్సో కూడా ₹31 వేల వరకు తగ్గింపుతో అమ్ముతున్నారు. ఈ కారులో 68hp, 1.0 లీటర్ ఇంజన్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో ఉంటుంది. మారుతి S-ప్రెస్సో బేస్ వేరియంట్ ధర రూ.3.85 లక్షలు. ఈ వాహనం మాన్యువల్ వేరియంట్‌పై రూ. 31 వేల వరకు, AMT వెర్షన్‌పై 16 వేల వరకు తగ్గింపును ఇస్తుంది.

మారుతి సుజుకి ఈకో

మారుతి సుజుకి ఈకో 5 సీటర్, 7 సీటర్ వెర్షన్‌లలో లభిస్తుంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ వాహనంపై కంపెనీ రూ.29 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది దేశంలోనే అత్యంత చౌకైన 7 సీట్ల కారు. దీని ధర రూ. 4.53 లక్షల నుంచి మొదలవుతుంది.

మారుతి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ పై రూ.27 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో జత చేసిన 1.2-లీటర్ డ్యూయల్‌జెట్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. మారుతి స్విఫ్ట్ బేస్ వేరియంట్ ధర రూ. 5.90 లక్షలు. AMT వెర్షన్‌పై 17 వేల రూపాయల వరకు తగ్గింపు ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story