Mahindra XUV 7XO : వామ్మో ఏంటీ అన్న ఈ క్రేజ్..మహీంద్రా లేటెస్ట్ కార్ కావాలంటే ఏడాది ఆగాల్సిందే

Mahindra XUV 7XO : వామ్మో ఏంటీ అన్న ఈ క్రేజ్..మహీంద్రా లేటెస్ట్ కార్ కావాలంటే ఏడాది ఆగాల్సిందే
x
Highlights

వామ్మో ఏంటీ అన్న ఈ క్రేజ్..మహీంద్రా లేటెస్ట్ కార్ కావాలంటే ఏడాది ఆగాల్సిందే

Mahindra XUV 7XO : మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ మహీంద్రా XUV 7XO భారత ఆటోమొబైల్ మార్కెట్లో సునామీ సృష్టిస్తోంది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ కారు కోసం కస్టమర్లు షోరూమ్‌ల ముందు క్యూ కడుతున్నారు. ఫీచర్లు, లుక్స్ పరంగా అదరగొడుతుండటంతో బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి. పరిస్థితి ఎలా ఉందంటే, ఈ కారును ఈరోజు బుక్ చేసుకుంటే డెలివరీ కోసం ఏకంగా ఏడాది కాలం పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.

మహీంద్రా తన ప్రతిష్టాత్మక మోడల్ XUV700 తర్వాత, దానికి అప్‌గ్రేడెడ్ వెర్షన్ లాగా XUV 7XOని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ.13.66 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ రూ.24.11 లక్షల వరకు ఉంది. అయితే, ఈ ధరలు కేవలం మొదటి 40,000 మంది కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ ప్రకటించింది. జనవరి 14 నుంచే డెలివరీలు ప్రారంభమైనప్పటికీ, విపరీతమైన డిమాండ్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోయింది. మహీంద్రా సమాచారం ప్రకారం.. XUV 7XO, XEV 9S కలిపి ఇప్పటివరకు 93,689 యూనిట్ల బుకింగ్స్ వచ్చాయి, వీటి విలువ దాదాపు రూ.20,500 కోట్లు.

ముఖ్యంగా ఈ కారులోని బేస్ వేరియంట్ (AX) కోసం కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా బేస్ మోడల్ అంటే పెద్దగా ఫీచర్లు ఉండవని అందరూ అనుకుంటారు, కానీ XUV 7XOలో మహీంద్రా ఆ రూల్ మార్చేసింది. బేస్ వేరియంట్ నుంచే మూడు 12.3-అంగుళాల హెచ్‌డీ స్క్రీన్లు, అడ్రినాక్స్ కనెక్టివిటీ, అమెజాన్ అలెక్సా, ఏకంగా ChatGPT సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్లను అందించింది. అందుకే ఈ బేస్ వేరియంట్ కావాలంటే కనీసం 12 నెలలు ఆగాల్సి వస్తోంది. ఇది పెట్రోల్, డీజిల్ రెండింటికీ వర్తిస్తుంది.

వేరియంట్ల వారీగా వెయిటింగ్ పీరియడ్ గమనిస్తే.. టాప్ వేరియంట్లు అయిన AX7, AX7T, AX7L కోసం కొంత తక్కువ నిరీక్షణ అవసరమవుతుంది. పెట్రోల్ AX7 మోడల్ 4 వారాల్లో డెలివరీ అవుతుండగా, డీజిల్ మోడల్ కోసం 6 వారాల సమయం పడుతోంది. ఎవరికైతే కారు వెంటనే కావాలని అనుకుంటారో, వారు ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సౌకర్యం ఉన్న AX7T ని ఎంచుకోవచ్చు. దీని వెయిటింగ్ పీరియడ్ కేవలం 4 వారాలు మాత్రమే. ఇక అత్యంత విలాసవంతమైన AX7L ఆటోమేటిక్ వేరియంట్ కోసం 4 నుంచి 6 నెలల వరకు వేచి చూడాల్సి ఉంటుంది.

మహీంద్రా XUV 7XO లోని ఇంటీరియర్, టెక్నాలజీ కస్టమర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 540-డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారి. సేఫ్టీ విషయంలో కూడా మహీంద్రా రాజీ పడకుండా అధునాతన అడాస్ ఫీచర్లను జోడించింది. ప్రొడక్షన్ సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ, వస్తున్న బుకింగ్స్ వేగాన్ని అందుకోవడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. మీరు కూడా ఈ సరికొత్త ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకుంటే, ఇప్పుడే బుక్ చేసుకోవడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories