Mahindra XUV 3XO EV: మహీంద్రా ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది

Mahindra XUV 3XO EV: మహీంద్రా ఎక్స్‌యూవీ ఎలక్ట్రిక్ వచ్చేస్తోంది
x
Highlights

Mahindra XUV 3XO EV: గత సంవత్సరం మహీంద్రా తన కొత్త ఎస్‌యూవీ XUV 3XOను మార్కెట్లో విడుదల చేసింది. ఇది దాని సెగ్మెంట్‌లో అత్యుత్తమ కాంపాక్ట్ ఎస్‌యూవీగా...

Mahindra XUV 3XO EV: గత సంవత్సరం మహీంద్రా తన కొత్త ఎస్‌యూవీ XUV 3XOను మార్కెట్లో విడుదల చేసింది. ఇది దాని సెగ్మెంట్‌లో అత్యుత్తమ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిరూపించింది. కస్టమర్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని మహీంద్రా కంపెనీ XUV 3XO ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేయనుంది. ఇటీవలే ఈ కారు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఈ సంవత్సరం మార్చిలో ఈ కారు మార్కెట్లోకి రావచ్చు. ఇది కంపెనీ చౌకైన EV కావచ్చని టాక్. ప్రస్తుతానికి ఈ కారు గురించి మహీంద్రా నుండి ఎటువంటి సమాచారం అందలేదు.

అయితే ఇప్పటి వరకు ఉన్న లీక్స్ ప్రకారం.. కొత్త ఎలక్ట్రిక్ XUV 3XO 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీ ఫుల్ ఛార్జింగ్ పై 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. XUV 3XO EV లీక్ అయిన స్పై షాట్‌లలో ఈ కారు డిజైన్ స్పష్టంగా కనిపిస్తుంది. కారు ముందు భాగంలో అదే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను రౌండ్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, C-సైజ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లను చూడచ్చు.

డిజైన్ పరంగా ఇందులో పెద్దగా మార్పులు కనిపించవు. ఇది రూఫ్ రైల్స్, ఓఆర్‌వీఎమ్‌లు,షార్క్ ఫిన్ యాంటెన్నా, 360-డిగ్రీ కెమెరాలు, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈపీబీ వంటి ఫీచర్లు ఉంటాయి. భారతదేశంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ధర రూ. 12.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది టాటా నెక్సాన్ ఈవీతో పోటీపడుతుంది.

ఈ ఎస్‌యూవీ స్పోర్టీ డిజైన్, మంచి ఫీచర్లు, ఇంజన్ పరంగా కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. XUV 3XO ప్రారంభ ధర రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది భద్రతలో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. XUV 3XO 3 ఇంజన్ ఎంపికలను కలిగి ఉంది, వీటిలో 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్ 82kW పవర్, 200 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది.

ఇది కాకుండా, దాని రెండవ ఇంజన్ కూడా 1.2L టర్బో పెట్రోల్, ఇది 96 kW పవర్, 200 Nm టార్క్ ఇస్తుంది. దీని మూడవ 1.5L టర్బో డీజిల్ ఇంజన్ 86Kw పవర్, 300 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్లు మాన్యువల్,ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో 21.2 km/l వరకు మైలేజీని అందిస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories