Bike Tips: మీరు ప్రతిరోజు బైక్‌ వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Know These Things Regarding the Maintenance of the Bike While Using it Every Day
x

Bike Tips: మీరు ప్రతిరోజు బైక్‌ వాడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే నష్టపోతారు..!

Highlights

Bike Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బైక్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. దీని అవసరం లేకుండా రోజు గడవదు.

Bike Tips: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు బైక్‌ మెయింటెన్‌ చేస్తున్నారు. దీని అవసరం లేకుండా రోజు గడవదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడికి వెళ్లాలన్నా బైక్‌ అవసరమే. అయితే రోజువారీ జీవితంలో బైక్‌ ఉపయోగించడం అందరు చేస్తారు. కానీ దాని మెయింటనెన్స్‌ని కొంతమంది పట్టించుకోరు. దీంతో కొద్ది రోజుల్లోనే వారు చాలా నష్టపోతారు. వాస్తవానికి కారు కంటే బైక్‌లను మెయింటెన్‌ చేయడం చాలా సులభం. అంతేకాకుండా బైకులు మంచి మైలేజీని కూడా అందిస్తాయి. అందుకే కారు కంటే బైక్ తీసుకోవడానికే ఎక్కువగా మొగ్గుచూపుతారు. అయితే బైక్ సాఫీగా నడవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.

తరచుగా బైక్‌ ఇంజిన్ ఆయిల్ మార్చాలి

వాస్తవానికి బైక్ ఇంజిన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మార్చవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే బైక్ ఎల్లప్పుడూ సరిగ్గా పనిచేస్తుంది. ఇంజిన్ ఆయిల్ బైక్‌కు ప్రాణం వంటిది. ఇది బైక్‌కు ఊపిరి పోసేలా పనిచేస్తుంది. బైక్ ఇంజిన్ ఆయిల్‌తో సమస్య ఉంటే బైక్ మొత్తం పాడవుతుంది. ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ లోపల భాగాల మధ్య కందెనగా పనిచేస్తుంది. ఇంజిన్ లోపల భాగాలలో లూబ్రికేషన్‌ను మెయింటెన్‌ చేస్తుంది. ఏదైనా నష్టాన్ని నివారిస్తుంది.

ఇంజిన్ ఆయిల్ చెక్‌ చేయండి

బైక్ ఇంజిన్ ఆయిల్ తరచు తనిఖీ చేయాలి. దీని కోసం డిప్ స్టిక్ సహాయం తీసుకోవచ్చు. ఆయిల్‌ స్థాయి సూచించిన పరిమితి కంటే తక్కువగా ఉంటే ఆపై వెంటనే కొత్త ఆయిల్‌ని భర్తీ చేయండి.

ఇంజిన్ వాయిస్

బైక్ ఇంజిన్ ఎక్కువగా శబ్దం చేస్తుంటే మెకానిక్‌కి చూపించి ఇంజిన్ ఆయిల్ మార్చండి. వాస్తవానికి ఇంజన్‌ భాగాలలో సరైన లూబ్రికెంట్‌ లేకపోవడం వల్ల అవి శబ్దం చేయడం ప్రారంభిస్తాయి.

బైక్ ఇంజిన్ నల్లగా మారకూడదు

బైక్ ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు డిప్‌స్టిక్‌తో ఆయిల్ చెక్ చేయండి. ఆయిల్ రంగు నల్లగా మారినట్లయితే వెంటనే మార్చండి. అంతేకాకుండా సెన్సార్‌ని తనిఖీ చేయడం వల్ల కూడా ఈ విషయం తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో బైక్‌లో కూడా ఇంజిన్ ఆయిల్ స్థితిని హెచ్చరించే సెన్సార్ వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories