Best Mileage Cars:పెట్రోల్‌ ఇంజిన్‌లో ఉత్తమ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!

Best Mileage Cars: ఈ రోజుల్లో ఇంధన ధరలు పెరగడంతో చాలామంది వాహనాల కొనుగోలుకి ముందు వెనుక ఆలోచిస్తున్నారు.

Arun Chilukuri
Updated on: 12 Jun 2023 9:01 PM IST
Know About the Best Mileage Cars in the Petrol Segment
X

Best Mileage Cars:పెట్రోల్‌ ఇంజిన్‌లో ఉత్తమ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!

Best Mileage Cars: ఈ రోజుల్లో ఇంధన ధరలు పెరగడంతో చాలామంది వాహనాల కొనుగోలుకి ముందు వెనుక ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో కారు, బైక్‌ కొనుగోలు చేయాలంటే అది దాని మైలేజీపై ఆధారపడి ఉంటుది. వినియోగదారుడు ఎంత ఖరీదైన కారు కొన్నా మైలేజీ గురించి టెన్షన్‌ పడాల్సిందే. దేశంలో అద్భుతమైన మైలేజీని ఇచ్చే కార్లు చాలానే ఉన్నాయి. అయితే ఏ కారు గరిష్ట మైలేజీని ఇస్తుందో చెప్పడం కొంచెం కష్టమే. అందులో కొన్నింటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దేశంలో అత్యంత మైలేజీనిచ్చే కారు మారుతి గ్రాండ్ విటారా. ఇది ఒక లీటరుకు 28కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. దీని తర్వాత అత్యధిక మైలేజీని ఇచ్చే పెట్రోల్ కారు హోండా సిటీ గ్రాండ్. ఇది అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన కారు. లీటరుకి 27.13kmpl మైలేజీని అందిస్తుంది. అయితే మారుతి గ్రాండ్ విటారా కంటే ముందు మారుతి సెలెరియో అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారుగా చెప్పేవారు. దీని మైలేజ్ దాదాపు లీటర్‌ పెట్రోల్‌కి 26kmpl వస్తుంది.

గ్రాండ్ విటారా అత్యధిక మైలేజీని అందించడానికి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ కింద కారులో ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది ఇంజిన్‌కు బలమైన శక్తినివ్వడంలో సహాయపడుతుంది. అలాగే గ్రాండ్ విటారాకు సమానమైన మైలేజీని అందించే కారు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రెండు కార్ల ఇంజిన్లు ఒకే విధమైన ఫీచర్లతో ఉంటాయి. అందుకే టయోటా ఎస్‌యూవీ కూడా అదే మైలేజీని అందిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story