
Kia: రూ.20 లక్షలకే 7 సీటర్.. కియా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు
Kia: దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా భారతదేశంలో తమ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కారును జూలై 15, 2025న లాంచ్ చేయనుంది.
Kia: దక్షిణ కొరియా కార్ల కంపెనీ కియా భారతదేశంలో తమ కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కారును జూలై 15, 2025న లాంచ్ చేయనుంది. దీని గురించి ఈ ఏడాది మే నెలలోనే పెట్రోల్/డీజిల్ వెర్షన్ లాంచ్ అయినప్పుడు ధృవీకరించారు. ఇది కియా ఇప్పటివరకు తయారుచేసిన ఎలక్ట్రిక్ కార్లలోకెల్లా అత్యంత తక్కువ ధరకు లభించే మోడల్ అవుతుంది. దీని ఇంజిన్, ఫీచర్లు ఎక్కువగా క్రెటాకు దగ్గరగా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటీరియర్ డిజైన్ గురించి పెద్దగా సమాచారం బయటకు రాలేదు. కానీ, ఇది పెట్రోల్ వెర్షన్ లాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో అదే సెంట్రల్ కన్సోల్, కొత్త స్టీరింగ్ వీల్ డిజైన్ ఉంటాయి. ఈ కారు 6, 7 సీట్ల వెర్షన్లలో అందుబాటులోకి వస్తుంది.
క్లావిస్ ఎంపీవీ తన సెగ్మెంట్‌లో అత్యధిక ఫీచర్లను కలిగి ఉన్న వాహనాల్లో ఒకటి. కాబట్టి, ఈవీ వెర్షన్ కూడా ఫీచర్ల విషయంలో వెనుకబడి ఉండదు. ఇందులో రెండు 12.3-అంగుళాల స్క్రీన్‌లు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ క్లస్టర్ కోసం. వీటితో పాటు, పానరోమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ కీ, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. ఇంకా, పవర్‌డ్, వెంటిలేటెడ్ సీట్లు, V2V, V2L టెక్నాలజీ, ADAS సిస్టమ్ కూడా ఉండొచ్చు.
కియా ఈ ఎలక్ట్రిక్ కారు ధరను సుమారు రూ.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించే అవకాశం ఉంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ధరతో సమానంగా ఉంటుంది. ఈ ధర వద్ద ఇది తన పోటీదారు బివైడి ఈమాక్స్7 కంటే కాస్త తక్కువకే లభిస్తుంది. కారెన్స్ ఈవీలో హ్యుందాయ్ కోనా ఈవీలో ఉపయోగించిన ఫ్రంట్ ఎక్సెల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇందులో 42 kWh బ్యాటరీ లభించే అవకాశం ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 నుండి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదు. ఇదే బ్యాటరీతో క్రెటా ఎలక్ట్రిక్ దాదాపు 392 కి.మీ ప్రయాణిస్తుంది. డిజైన్ పరంగా ఈ కారు తన పెట్రోల్ వెర్షన్ లాగే కనిపిస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




