Kia Carens: రూ. లక్షతో ఈ సూపర్‌ కార్‌ మీ సొంతం.. నెలకు ఎంత EMI చెల్లించాలో తెలుసా?

Kia Carens EMI and Price Own This 7-Seater Car with Just RS 1 Lakh Down Payment
x

Kia Carens: రూ. లక్షతో ఈ సూపర్‌ కార్‌ మీ సొంతం.. నెలకు ఎంత EMI చెల్లించాలో తెలుసా?

Highlights

Kia Carens: కొరియన్‌ ఆటోమొబైల్‌ సంస్థ కియాకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. కొంగొత్త వేరియంట్స్‌లో, అధునాతన ఫీచర్లతో కార్లను లాంచ్‌ చేస్తోందీ సంస్థ.

Kia Carens: కొరియన్‌ ఆటోమొబైల్‌ సంస్థ కియాకు భారత్‌లో మంచి ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. కొంగొత్త వేరియంట్స్‌లో, అధునాతన ఫీచర్లతో కార్లను లాంచ్‌ చేస్తోందీ సంస్థ. ఈ క్రమంలోనే కియా నుంచి వచ్చిన కియా కారెన్స్‌ అమ్మకాలు భారీగా జరుగుతున్నాయి. ఇంతకీ ఈ కారు ధర ఎంత ఉంది.? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కియా కారెన్స్‌ ఎక్స్ షోరూమ్‌ ధర రూ. 10.6 లక్షలుగా ఉంది. 7 సీటర్ కారు కోసం చూస్తున్నవారికి కియా కారెన్స్ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. అయితే ఆన్‌రోడ్‌ ధర విషయానికొస్తే ఈ కారు ధర రూ. 12.28 లక్షలుగా ఉంది. ఇదిలా ఉంటే ఈ కారును కేవలం రూ. 1 లక్ష డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం చేసుకోవచ్చు. మంచి సిబిల్‌ స్కోర్‌ ఉన్న వారికి రూ. 11.28 లక్షల రుణం లభిస్తుంది. సాధారణంగా కారు లోన్‌కి వడ్డీ రేటు 9.8 శాతం ఉంటుంది. 5 ఏళ్ల రుణ పరిమితికి తీసుకుంటే నెలకు రూ. 24,000 ఈఎమ్‌ఐని చెల్లించవచ్చు.

అయితే వడ్డీతో కలిసి మొత్తం రూ. 14.31 లక్షలు అవుతుంది. ఇక ఈ కారు ఫీచర్ల విషయానికొస్తే కియా కారెన్స్‌ను మూడు ఇంజన్‌ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 116hp పవర్ వద్ద 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 115hp పవర్, 144Nm టార్క్ను ప్రొడ్యూస్‌ చేస్తుంది. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160hp పవర్, 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్ – 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ ఆటోమేటిక్‌ను అందించారు.

ఇక ఈ కారులో 10.25 ఇంచెస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించనున్నారు. ఎయిర్ ప్యూరిఫైయర్, 6 ఎయిర్‌బ్యాగ్స్ (స్టాండర్డ్), కన్నెక్టెడ్ కార్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్యానోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను అందించారు. మైలేజ్ విషయానికొస్తే పెట్రోల్‌ వేరియంట్‌ లీటర్‌కు 16 నుంచి 17 కిలోమీటర్లు అందిస్తుంది. డీజిల్‌ వేరియంట్‌ విషయానికొస్తే లీటర్‌కి 20 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories