Kia Carens EV: కియా నుంచి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్.. రూ. 20 లక్షలకే ఊహకందని ఫీచర్స్

Kia Carens electric variant car to be launched soon and Price likely to be around Rs 20 lakhs, know its features
x

కియా నుంచి పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్.. రూ. 20 లక్షలకే ఊహకందని ఫీచర్స్

Highlights

Kia Carens EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కియా ఇప్పుడు ఫ్యామిలీ కార్ కేరెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి...

Kia Carens EV: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కియా ఇప్పుడు ఫ్యామిలీ కార్ కేరెన్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త మోడల్ ద్వారా కంపెనీ మాస్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ కార్లపై పూర్తిగా దృష్టి సారిస్తోంది. ఇప్పుడు క్రమంగా ఈవీల ధరలు కూడా పెట్రోల్ కార్లతో సమానంగా వస్తున్నాయి. కియా ఇండియా భారత్‌లో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఆ కంపెనీ తదుపరి ప్లాన్ చేసుకుంటోన్న మోడల్ కేరెన్స్ ఎలక్ట్రిక్ వేరియంట్ కారు. ఈ ఎలక్ట్రికక్ కారు ధర, ఫీచర్లు, తదితర వివరాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కియా కేరెన్స్ EV కారు డిజైన్

కొత్త కియా కేరెన్స్ పెట్రోల్ మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్‌లో చాలా మార్పులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ కేరెన్స్‌కు భిన్నమైన డిజైన్ కోసం కొత్త గ్రిల్, బానెట్, బంపర్, వీల్స్‌లో కొత్తదనాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కారు వివిధ భాగాలపై ఈవీ లోగో కనిపిస్తుంది.

కియా కేరెన్స్ EV కారు రేంజ్

కొత్త కియా కేరెన్స్ ఈవీ బ్యాటరీ, రేంజ్‌కి సంబంధించి కంపెనీ నుండి ఎటువంటి సమాచారం అందలేదు. కానీ ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం దీనిలో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ఉంటుందని తెలుస్తోంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌ని అందించగలదని అంచనాలొస్తున్నాయి. ఇది DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుందని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చురుకుగా వ్యవహరించే లీకు వీరులు చెబుతున్నారు.

కియా కేరెన్స్ EV కారు సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ విషయంలో కొత్త కియా కేరెన్స్‌లో లెవల్ 2 అడాస్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, బ్రేక్ అసిస్ట్, ఈపీఎస్, 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉంటాయి. కియా ఈ కొత్త ఈవీని ఈ సంవత్సరం భారత్‌లో లాంచ్ చేయనుంది. ఈ కారు అంచనా ధర దాదాపు రూ. 20 లక్షలుగా ఉండే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories