2025 Kia Carens: కంప్లీట్ ఫ్యామిలీ కార్.. మీకు కావాల్సిన స్టైల్, కంఫర్ట్, స్పేస్.. పెద్ద కుటుంబంతో హాయిగా ట్రిప్‌కు వెళ్లచ్చు..!

2025 Kia Carens
x

2025 Kia Carens: కంప్లీట్ ఫ్యామిలీ కార్.. మీకు కావాల్సిన స్టైల్, కంఫర్ట్, స్పేస్.. పెద్ద కుటుంబంతో హాయిగా ట్రిప్‌కు వెళ్లచ్చు..!

Highlights

2025 Kia Carens: భారత మార్కెట్లో కియా మోటార్స్ అనేక విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. 2025లో కియా కేరెన్స్‌ను త్వరలో కొత్త వాహనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

2025 Kia Carens: భారత మార్కెట్లో కియా మోటార్స్ అనేక విభాగాలలో వాహనాలను విక్రయిస్తుంది. 2025లో కియా కేరెన్స్‌ను త్వరలో కొత్త వాహనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే కొత్త ఎంపివిలో అనేక సరికొత్త ఫీచర్లు అందించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త కియా కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.

2025 Kia Carens Features

కియా మోటార్ ఇండియా త్వరలో కొత్త కేరెన్స్‌ను కొత్త కారుగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త కేరెన్స్ ఇప్పటికే ఉన్న వెర్షన్ కంటే అనేక మెరుగైన ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు. కొన్ని కాస్మెటిక్ మార్పులు కూడా చేయవచ్చు. ఈ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ దీనికి లెవల్ 2 ADAS, పనోరమిక్ సన్‌రూఫ్, కొత్తగా రూపొందించిన ఇంటీరియర్, డ్యాష్‌బోర్డ్‌తో పాటు కొత్త, బంపర్‌లు, గ్రిల్‌ను అందించవచ్చని భావిస్తున్నారు.

2025 Kia Carens Specifications

కేరెన్స్‌ను కియా ఎంపివిగా అందిస్తోంది. ఇందులో 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైట్లు, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, బోస్ ఆడియో సిస్టమ్ వంటివి ఉంటాయి. ఆరు, ఏడు సీట్ల ఎంపికగా వస్తుంది

2025 Kia Carens Engine

ఈ ఎంపివి 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికలతో రానుంది. ఈ ఇంజిన్లతో కొత్త కేరెన్స్‌ కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనితో మాన్యువల్, DCT వంటి ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా ఉంటాయి.

కేరెన్స్ ప్రస్తుత వెర్షన్ మారుతి ఎర్టిగాతో నేరుగా పోటీపడుతుంది. కానీ కొత్త కారెన్స్ జేఎస్ డబ్ల్యూ ఎంజీ హెక్టర్, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్ యూవీ 700, టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి ఎస్యూవీలతో నేరుగా పోటీ పడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories