Kia Carens Clavis: కొత్త ఫ్యామిలీ కారు.. కియా కేరెన్స్ క్లావిస్‌ దిగింది.. ఫీచర్స్ అమేజింగ్..!

Kia Carens Clavis: కొత్త ఫ్యామిలీ కారు..  కియా కేరెన్స్ క్లావిస్‌ దిగింది.. ఫీచర్స్ అమేజింగ్..!
x

Kia Carens Clavis: కొత్త ఫ్యామిలీ కారు.. కియా కేరెన్స్ క్లావిస్‌ దిగింది.. ఫీచర్స్ అమేజింగ్..!

Highlights

Kia Carens Clavis: కియా ఇండియా ఇటీవల తన కొత్త ఫ్యామిలీ కారు కేరెన్స్ క్లావిస్‌ను ఆవిష్కరించింది.

Kia Carens Clavis: కియా ఇండియా ఇటీవల తన కొత్త ఫ్యామిలీ కారు కేరెన్స్ క్లావిస్‌ను ఆవిష్కరించింది.ఇప్పుడు కంపెనీ దాని ధరలను ప్రకటించింది. ఇందులో 20 భద్రతా ఫీచర్లతో లెవల్-2 అడాస్ కూడా ఉంది. దీనిలో 3 ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది అనేక ఫీచర్లతో నిండి ఉంది, కానీ కొన్నింటిని మినహాయించి, మిగిలిన వాటిని మీరు ఉపయోగించలేరు. ఇది మాత్రమే కాదు.. ఈ కారు డిజైన్ పరంగా కూడా మిస్ అయింది. అది ఎలాగో తెలుసుకుందాం.

Kia Carens Clavis Price

కియా కేరెన్స్ క్లావిస్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభిస్తుంది. ఇందులో ఎంటీ, డీసీటీ, ఏటీ, ఐఎమ్‌టీ గేర్‌బాక్స్ ఉంటాయి. దీనిలో మొత్తం 24 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.50 లక్షల నుండి రూ. 21.50 లక్షల మధ్య ఉంటుంది. కియా ఈ కారులో 2 డజన్ల వేరియంట్లను అందించింది, ఇది కస్టమర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా, ఈ కారు డిజైన్‌లో కొత్తదనం ఏమీ లేదు, అలాగే అంత మెరుగ్గా కూడా కనిపించడం లేదు. ఇక్కడ కంపెనీ దాని డిజైన్‌పై మరింత కృషి చేసి ఉండాలి.

Kia Carens Clavis Engine

కేరెన్స్ క్లావిస్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. మీ అవసరానికి అనుగుణంగా ఇంజిన్‌ను ఎంచుకోవచ్చు. ఈ రైలు బుకింగ్ ఈ రాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలో ఇది మహీంద్రా స్కార్పియో ఎన్, ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్, టయోటా ఇన్నోవా క్రిస్టాలతో నేరుగా పోటీపడుతుంది.

Kia Carens Clavis Features

కొత్త కేరెన్స్ డిజైన్ అంతకుముందు కూడా ఆకట్టుకోలేదు, ఇప్పుడు కేరెన్స్ క్లావిస్ డిజైన్ కూడా చాలా నిరాశపరిచింది. దాని డిజైన్,లుక్‌లో కొత్తదనం ఏమీ లేదు. జరిగిన మార్పులు కూడా ప్రత్యేకమైనవి కావు. కానీ దానిలో ఫీచర్లను అందించడంలో కంపెనీ ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. దీనిలో చాలా ఫీచర్లు అందించారు. దీనిలో మీరు 24 వేరియంట్లు పొందుతారు. ఏ మోడల్ కొనడం ప్రయోజనకరంగా ఉంటుందో అని కస్టమర్లు ఆలోచిస్తూ ఉండవచ్చు. కియా కొత్త ఎంపీవీ కేరెన్స్ క్లావిస్ కొత్త 2.0 డిజైన్‌తో అందించారు. కంపెనీ అదే డిజైన్‌పై EV9, సైరోస్ వంటి కార్లను కూడా అందిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories