iVOOMi S1 Lite: నెలకు రూ.1499 చెల్లిస్తే చాలు.. 120 కి.మీల రేంజ్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!

iVOOMi S1 Lite: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఈ స్కూటర్లను, కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

iVOOMi Launched New Budget Electric Scooter iVOOMi S1 Lite Features and Price Details
X

iVOOMi S1 Lite: నెలకు రూ.1499 చెల్లిస్తే చాలు.. 120 కి.మీల రేంజ్‌తో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..!

iVOOMi S1 Lite: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఈ స్కూటర్లను, కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ వెహికిల్స్‌ధరలు కూడా భారీగా తగ్గుముఖం పడుతుండడంతో వీటి అమ్మకాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్‌ అయ్యింది. అత్యంత తక్కువ ధరకే ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. నెలకు కేవలం రూ. 1499 ఈఎమ్‌ఐ చెల్లిస్తూ ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ స్కూటర్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐవూమి ఎస్‌1 లైట్‌ పేరుతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేశారు. పేరుకు తగ్గట్లుగానే ఈ స్కూటర్‌ తక్కువ బరువుతో తీసుకొచ్చారు. దీంతో మహిళలు సులభంగా ఈ స్కూటర్‌ను నడపడానికి వీలు ఉంటుంది. అంతేకాదండోయ్‌ ఈ స్కూటర్‌ వేగం కూడా బాగానే ఉంటుంది. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు. ఈ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీని అందించారు. దీంతో బ్యాటరీని బయటకు తీసి ఎంచక్కా ఛార్జ్‌ చేసుకోవచ్చు.

మూడేళ్ల వారంటీ అందించారు. ఈ స్కూటర్‌ను వైట్, గ్రే, రెడ్, బ్లూ, ట్రూ రెడ్, పీకాక్ బ్లూ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం బుకింగ్స్ జరుగుతోన్న ఈ స్కూటర్‌ను రెండు బ్యాటరీ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు ధర విషయానికొస్తే... గ్రాఫీన్ ఐయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 54,999 కాగా, లిథియం ఐయాన్ బ్యాటరీ స్కూటర్ ధర రూ. 64,999గా నిర్ణయించారు. ఇక స్కూటర్‌ గ్రౌండ్ క్లియరెన్స్‌ 170 ఎంఎం, బూట్‌స్పేస్ 18 లీటర్లుగా ఉంది. ఎల్ఈడీ డిస్‌ప్లేతో స్పీడోమీటర్ ఉండి 10, 12 అంగుళాల వీల్స్‌ను అందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story