Hyundai I20 Facelift: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 40కి పైగా సేఫ్టీ ఫీచర్లుతో హ్యుందాయ్ i20 ఫేస్‌లిఫ్ట్.. ధరెంతో తెలుసా?

Hyundai I20 Facelift Launched At ₹6.99 Lakh
x

Hyundai I20 Facelift: ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లోని 40కి పైగా సేఫ్టీ ఫీచర్లుతో హ్యుందాయ్ i20 ఫేస్‌లిఫ్ట్.. ధరెంతో తెలుసా?

Highlights

Hyundai I20 Facelift: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది.

Hyundai I20 Facelift: హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఐ20 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. కంపెనీ కారులో కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్‌లను చేసింది. ఇది కాకుండా, కారు ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్, ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో వస్తుంది. సెగ్మెంట్లో ఇది టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో, టయోటా గ్లాంజాతో పోటీపడుతుంది.

కారుకు కొత్త బేస్ వేరియంట్ జోడించబడింది. ఇప్పుడు దాని నుంచి టర్బో పెట్రోల్ ఇంజన్ ఎంపిక తీసివేయసింది. దీని కారణంగా, ఐ20 ప్రారంభ ధర, టాప్ వేరియంట్ ధర తగ్గింది. i20 ఫేస్‌లిఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య పేర్కొంది.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్..

ఎక్స్‌టీరియర్ డిజైన్ గురించి మాట్లాడితే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ముందు భాగంలో కొత్త పారామెట్రిక్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కూడిన LED హెడ్‌ల్యాంప్స్ సెటప్ ఉన్నాయి. బంపర్ రీడిజైన్ చేశారు. ఇది రేసింగ్ స్కర్ట్ రూపాన్ని ఇస్తుంది.

కొత్త ఐ20లో ఫాగ్ ల్యాంప్‌లు లేవు. అయితే, ఎయిర్ డ్యామ్ అప్‌డేట్ చేశారు. బానెట్‌పై 3D లోగో అందించారు. ఈ కారుకు 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అందించారు. ఇవి కారును మరింత స్పోర్టీగా మార్చాయి.

వెనుక ప్రొఫైల్ కూడా నవీకరించారు. ఇది ఇప్పుడు కొత్తగా రూపొందించిన బంపర్‌ను పొందుతుంది. వెనుక వైపున, ఇది ఇప్పటికీ మునుపటి మాదిరిగానే Z-ఆకారపు టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది.

ఈ కారు 6 సింగిల్, 2 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. వీటిలో అమెజాన్ గ్రే, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్టార్రీ నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్+బ్లాక్ రూఫ్, ఫైరీ రెడ్+బ్లాక్ రూఫ్ ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ సేఫ్టీ ఫీచర్లు..

కారులో 40కి పైగా సేఫ్టీ ఫీచర్లు అందించబడ్డాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM), 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, చైల్డ్ ISOFIX యాంకర్ సీట్లు, అన్ని సీట్లకు సీట్ బెల్ట్ రిమైండర్ ఉన్నాయి. వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు కూడా దీని టాప్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories