Driving License Address Change: డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలా? ఆన్‌లైన్‌లో ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Driving License Address Change
x

Driving License Address Change: డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలా? ఆన్‌లైన్‌లో ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Highlights

Driving License Address Change: మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్చుకోవాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో సులభంగా అడ్రస్ మార్చుకునే విధానం, కావాల్సిన పత్రాలు మరియు స్లాట్ బుకింగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Driving License Address Change: ఉద్యోగ రీత్యా లేదా వ్యాపారాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి ఇది ముఖ్య గమనిక. పాత అడ్రస్‌తో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్‌ను (DL) ప్రస్తుత నివాస చిరునామాకు మార్చుకోవడం వల్ల అది భవిష్యత్తులో రెన్యువల్‌కు మరియు ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రంగా ఎంతో ఉపయోగపడుతుంది. రవాణా శాఖ ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా చాలా సులభతరం చేసింది.

కావాల్సిన పత్రాలు (Required Documents):

ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్.

♦ ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ పత్రం (ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, కరెంటు బిల్లు లేదా గ్యాస్ బిల్లు).

ముఖ్య గమనిక: దరఖాస్తుదారుడి వయస్సు 40 ఏళ్లు దాటితే తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేట్ (ఫాం 1-ఎ) సమర్పించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు విధానం ఇలా..

వెబ్‌సైట్ సందర్శన: మొదట కేంద్ర రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ parivahan.gov.in ఓపెన్ చేయాలి.

సర్వీస్ ఎంపిక: హోమ్ పేజీలో 'Online Services' లోకి వెళ్లి 'Driving License Related Services' క్లిక్ చేయాలి. రాష్ట్రాల జాబితాలో 'Telangana' ఎంచుకోవాలి.

అడ్రస్ మార్పు: అనంతరం 'Apply Change of Address' ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ డీఎల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

వివరాల నమోదు: 'Get DL Details' పై క్లిక్ చేస్తే మీ పాత వివరాలు కనిపిస్తాయి. అక్కడ 'Change of Address' ఎంచుకుని ప్రస్తుత తెలంగాణ చిరునామాను ఎంటర్ చేయాలి.

ఫీజు చెల్లింపు: దరఖాస్తును సబ్మిట్ చేసిన తర్వాత నిర్ణీత రుసుమును ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాలి.

చివరి దశ - ఆర్టీవో కార్యాలయం:

ఫీజు చెల్లించిన తర్వాత, మీ దగ్గరలోని ఆర్టీవో (RTO) కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన కోసం ఒక తేదీని (Slot) బుక్ చేసుకోవాలి. కేటాయించిన రోజున ఒరిజినల్ పత్రాలతో కార్యాలయానికి వెళ్లి అధికారుల ఆమోదం పొందాలి. వెరిఫికేషన్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే కొత్త చిరునామాతో కూడిన స్మార్ట్ కార్డ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories