Honda CB500X: హోండా ప్రీమియం బైక్: ధర ఎంతంటే...

హోండా సీబీ500ఎక్స్ ప్రీమియం బైక్ (ఫొటో ట్విట్టర్)
Honda HMSI CB500X: హోండా మోటార్ కొత్త అడ్వెంచర్ ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
Honda HMSI CB500X: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) కొత్త అడ్వెంచర్ ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. CB500X పేరిట విడుదల చేసిన ఈ బైక్ ధరను రూ.6.87 లక్షలు (ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. బుకింగ్స్ కూడా ప్రారంభించినట్లు తెలిపింది. ప్రయాణికులకు గొప్ప అనుభూతిని అందించేందుకు ఈ ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సుషి ఒగాటా పేర్కొన్నారు. కంపెనీకి చెందిన బిగ్‌వింగ్ డీలర్‌షిప్స్ ద్వారా దేశవ్యాప్తంగా వీటిని విక్రయించనున్నారు.
ఈ బైక్‌లో 8 వాల్వ్ ట్విన్ సిలిండర్ 471 సీసీ లిక్విడ్ కూల్ ఇంజిన్ అమర్చారు. మొత్తం 6 గేర్లు ఉంటాయి. ముందూ వెనుక ఏబీఎస్‌తో కూడిన డిస్క్ బ్రేక్ సదుపాయం ఇస్తున్నారు. ఈ ఇంజిన్ 8,500 ఆర్‌పీఎం వద్ద 47 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. ఇవే కాకుండా ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్ ఉంది. ఇది సడెన్ బ్రేక్ వేసినప్పుడు వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా ముందూ వెనుక లైట్లను ఆన్ చేస్తుంది. ఈ బైక్ గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాటీ గన్ పౌడర్ బ్లాక్ మెటాలిక్ రంగుల్లో లభించనుంది.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్
19 May 2022 5:27 PM GMTబాయ్ ఫ్రెండ్ తో కలిసి కప్పలు తిన్న కంగనా...
19 May 2022 4:30 PM GMTవచ్చే ఎన్నికలే నా చివరి ఎన్నికలు.. సంచలన ప్రకటన చేసిన ఉత్తమ్...
19 May 2022 4:00 PM GMTNTR 30: ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిఫ్ట్
19 May 2022 3:45 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMT