Hero Splendor Electric: త్వరలోనే మార్కెట్‌లోకి హీరో స్ల్పైండర్ ఎలక్ట్రిక్ బైక్

Hero Splendor Electric: త్వరలోనే మార్కెట్‌లోకి హీరో స్ల్పైండర్  ఎలక్ట్రిక్ బైక్
x
Highlights

ద్విచక్ర వాహనాల తయారీలో హీరో మోటోకార్ప్ నంబర్ 1. .

Hero Splendor Electric: ద్విచక్ర వాహనాల తయారీలో హీరో మోటోకార్ప్ నంబర్ 1. ఈ కంపెనీ విక్రయిస్తున్న స్ప్లెండర్ మధ్యతరగతి ప్రజల ఫేవరెట్ మోటార్‌సైకిల్. ఈ కారణంగానే పెద్ద ఎత్తున ఈ వాహనాల విక్రయాలు కూడా జరుగుతున్నాయి. ఇదే బైక్‌ను ఎలక్ట్రిక్ విభాగంలో కూడా తీసుకురానుందని చెబుతున్నారు.

, హీరో మోటోకార్ప్ వివిధ ప్రయాణీకులకు అనుకూలమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేస్తోంది. స్ప్లెండర్ EVని లాంచ్ చేయడం కంపెనీ ప్రతిష్టాత్మక ప్రణాళికలలో ఒకటిగా ఉంది. దీనికి సంబంధించి రాజస్థాన్‌లోని జైపూర్‌లోని 'హీరో టెక్నాలజీ సెంటర్'లో టెక్నాలజీ నిపుణులు బిజీగా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి.

అన్నీ అనుకున్నట్టు జరిగితే మొదటి హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ 2027లో విడుదలయ్యే అవకాశం ఉంది. కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి సంవత్సరానికి 2,00,000 యూనిట్ల స్ప్లెండర్ EVలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త హీరో స్ప్లెండర్ EV పనితీరు గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ బైక్ 4 కిలోవాట్ (kWh), 6 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫుల్ ఛార్జింగ్ పెడితే 120 నుంచి 180 కిలోమీటర్ల రేంజ్ (మైలేజీ) ఇస్తుందని చెబుతున్నారు. దీని ధర రూ.లక్ష వరకు ఉంటుందని ఊహగానాలు వెలువడుతున్నాయి.

హీరో స్ప్లెండర్ EV కాకుండా విడా డర్ట్ అనే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. దీనిని అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రమే విక్రయించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఈ బైక్‌ను 2026లో విడుదల చేయాలని భావిస్తున్నారు. హీరో సంవత్సరానికి దాదాపు 10,000 యూనిట్ల 'విదా డర్ట్' ఎలక్ట్రిక్ బైక్‌ను ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం సాధారణ 'హీరో స్ప్లెండర్' బైక్ దేశీయ విపణిలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని స్ప్లెండర్ ప్లస్ మోడల్ ధర రూ. 76,000, రూ. 79,500 (ఎక్స్-షోరూమ్). ఇది 97.2 cc పెట్రోల్ ఇంజన్. 70 kmpl మైలేజీని అందిస్తుంది. ఇందులో డ్రమ్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్సె‌టెక్ మోడల్ గురించి చెప్పాలంటే దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.80,000 నుండి రూ.83,500 వరకు ఉంటుంది. 97.2 cc పెట్రోల్ ఇంజన్, 4-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. ఇది 70 kmpl మైలేజీని కూడా ఇస్తుంది. మరో వైపు హీరో సూపర్ స్ప్లెండర్ ఈ బైక్ ధర రూ.82,500 నుండి రూ.86,500 (ఎక్స్-షోరూమ్). ఇది 124.7 cc పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. 60 kmpl వరకు మైలేజీని అందిస్తుంది. డిజిటల్-ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్‌తో సహా డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్‌లను కలిగి ఉంది.



Show Full Article
Print Article
Next Story
More Stories