Hero Splendor: హీరోగా నిలిచిన స్ప్లెండర్.. కంపెనీ సేల్స్‌ను భారీగా పెంచేసింది.. !

Hero Sold 442873  Units of Vehicles in the First Month of 2025
x

Hero Splendor: హీరోగా నిలిచిన స్ప్లెండర్.. కంపెనీ సేల్స్‌ను భారీగా పెంచేసింది..!

Highlights

Hero Splendor: ఇండియా ద్విచక్ర వాహనాల మార్కెట్ విషయానికి హీరో పేరు ప్రముఖంగా కనిపిస్తుంది.

Hero Splendor: ద్విచక్ర వాహనాల మార్కెట్ విషయానికి హీరో కంపెనీ పేరు ప్రముఖంగా కనిపిస్తుంది. హీరో మోటోకార్ప్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల బ్రాండ్. కొత్త సంవత్సరం కూడా కంపెనీకి ఈ పేరును నిలబెట్టుకుంది.2025 సంవత్సరం జనవరిలో.. హీరో 4,42,873 యూనిట్ల వాహనాలను విక్రయించారు.

గత ఏడాది జనవరి 2024లో విక్రయించిన ద్విచక్ర వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 2.14శాతం ఎక్కువ. కంపెనీ ఎగుమతి విక్రయాలు కూడా 140శాతం పైగా పెరిగాయి.

హీరో మోటోకార్ప్ లైనప్‌లో అనేక బైక్‌లు, స్కూటర్‌లు ఉన్నాయి. కంపెనీ ఇటీవల అనేక ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. ఈ జాబితాలో Xtreme 250R, Xpulse 210, Destini 125, Xoom 125, Xoom 160, VIDA V2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉన్నాయి. ప్రముఖ స్ప్లెండర్ బైక్ కూడా హీరో విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ స్ప్లెండర్. నగరాల నుండి గ్రామం వరకు ఈ బైక్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. దేశీయ మార్కెట్లో స్ప్లెండర్ ప్లస్ ప్రారంభ ధర రూ.77,176. ఈ బైక్‌లో 97.2 cc సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. బైక్ మైలేజ్ దాదాపు 70KMPL.

Hero Splendor

స్ప్లెండర్ ప్లస్ ఫోర్స్ సిల్వర్, బ్లాక్ రెడ్ పర్పుల్, స్పోర్ట్స్ రెడ్ బ్లాక్ కలర్ వంటి మల్టీ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో డ్రమ్ బ్రేక్ ఉంది. ఈ మోటార్‌ సైకిల్ బరువు 112 కిలోలు, అలానే బైక్‌లో 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌ అందించారు.

Hero Splendor Plus XTEC

ఈ మోడల్ డిస్క్ బ్రేక్‌తో అందుబాటులో ఉంది. ఎక్స్‌టెక్ ధర రూ. 80,161 నుండి రూ. 83,461 మధ్య ఉంటుంది. బైక్ 97.2 cc ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 4-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ ఉంటుంది. ఈ మోడల్‌లో LCD ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎలక్ట్రిక్ స్టార్టర్, సైడ్-స్టాండ్ ఇంజన్ కట్-ఆఫ్, అల్లాయ్ వీల్స్, డ్రమ్ , డిస్క్ బ్రేక్‌లు ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Hero Splendor Plus

హీరో సూపర్ స్ప్లెండర్ గురించి దీని ధర రూ. 82,298 నుండి రూ. 86,298 ఎక్స్-షోరూమ్ మధ్య ఉంటుంది. ఈ బైక్‌లో 124.7 cc, ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. స్ప్లెండర్ ఈ మోడల్ లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు.

Show Full Article
Print Article
Next Story
More Stories