Honda: హోండా కొనుగోలుదారులకి శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు..!

Good News for Honda Buyers Huge Discount on These Cars
x

Honda: హోండా కొనుగోలుదారులకి శుభవార్త.. ఈ కార్లపై భారీ తగ్గింపు..!

Highlights

Honda: హోండా కార్స్ ఇండియా మే 2022లో తన కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

Honda: హోండా కార్స్ ఇండియా మే 2022లో తన కార్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ జపనీస్ సంస్థ తన అన్ని కార్లపై ఈ ఆఫర్‌లను అందించింది. ఇవి మే 31 వరకు వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ తగ్గింపులన్నీ హోండా అమేజ్, హోండా సిటీ ఐదో జనరేషన్, నాలుగో జనరేషన్, హోండా WRV (WR-V), హోండా జాజ్‌లపై అందుబాటులో ఉంటాయి. హోండా కార్స్ ఇండియా మోడల్, వేరియంట్ ఆధారంగా అన్ని కార్లపై రూ.33,000 వరకు ఆఫర్‌లను అందించింది.

హోండా సిటీ 5వ జనరేషన్

ఈ సెడాన్‌పై కంపెనీ గరిష్టంగా రూ.30,396 తగ్గింపును ప్రకటించింది. ఇందులో రూ.5,000 వరకు నగదు తగ్గింపు, కార్ల మార్పిడిపై రూ. 5,396 ప్రయోజనాలు ఉంటాయి. పాత హోండా కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ.5,000 వరకు హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్, ప్రస్తుత హోండా కారుపై రూ.7,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ తగ్గింపు ఉంటాయి. కస్టమర్‌లు, మాజీ హోండా కస్టమర్‌లపై రూ.8,000. కార్పొరేట్ తగ్గింపు ఉంటుంది.

హోండా సిటీ 4వ జనరేషన్

నాలుగో జనరేషన్‌ హోండా సిటీపై రూ.20,000 వరకు ఆఫర్‌లు అందించారు. కంపెనీ పాత హోండా కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, రూ. 7,000 వరకు హోండా కార్ ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఈ రూ. 8,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇచ్చింది.

హోండా జాజ్

హోండా ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై వినియోగదారులకు రూ. 33,158 వరకు ప్రయోజనాన్ని అందించింది. ఇందులో రూ.10,000 వరకు నగదు తగ్గింపు లేదా రూ.12,158 వరకు FOC యాక్సెసరీలు, ఎక్స్ఛేంజ్ బోనస్ కోసం రూ. 5,000, పాత హోండా కస్టమర్లకు రూ. 5,000 వరకు లాయల్టీ బోనస్, హోండా కార్ ఎక్స్ఛేంజ్‌పై రూ. 7,000, రూ. 4,000 వరకు కార్పొరేట్ తగ్గింపు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories