Number Plates: నంబర్ ప్లేట్స్ ఎన్ని రంగుల్లో ఉంటాయి, వాటి అర్థమేంటో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..!

From Red To Blue Check These Vehicle Number Plates And Meaning In India
x

Number Plates: నంబర్ ప్లేట్స్ ఎన్ని రంగుల్లో ఉంటాయి, వాటి అర్థమేంటో తెలుసా? ఆసక్తికర విషయాలు మీకోసం..!

Highlights

Vehicle Number Plates: భారతదేశంలోని చాలా వాహనాలు తెలుపు రంగులో ఉన్న నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండడం మనకు తెలిసిందే. దానిపై అక్షరాలు, సంఖ్యలు నలుపు రంగులో ఉంటాయి. కానీ కొన్ని వాహనాలు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు నంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి.

Car Number Plates: భారతదేశంలోని చాలా వాహనాలు తెలుపు రంగులో ఉన్న నంబర్ ప్లేట్‌లను కలిగి ఉండడం మనకు తెలిసిందే. దానిపై అక్షరాలు, సంఖ్యలు నలుపు రంగులో ఉంటాయి. కానీ కొన్ని వాహనాలు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు నంబర్ ప్లేట్లను కలిగి ఉంటాయి. దానిపై అక్షరాలు, సంఖ్యలు వేర్వేరు రంగుల్లో రాస్తుంటారు. ఇలాంటి విభిన్న రంగుల నంబర్ ప్లేట్‌ల అర్థం ఏమిటో మీకు తెలుసా? వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

తెల్లటి ప్లేట్‌పై నల్లని సంఖ్యలు..

ఈ నంబర్ ప్లేట్లు అత్యంత సాధారణమైనవి. ప్రైవేట్ వాహనాలకు జారీ చేస్తుంటారు. ఈ సంఖ్య చాలా కార్లు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు మొదలైన వాటిలో కనిపిస్తుంది. ఇది అత్యంత సాధారణ నంబర్ ప్లేట్.

పసుపు పలకలపై నలుపు సంఖ్యలు..

ఈ నంబర్ ప్లేట్లను వాణిజ్య వాహనాలకు ఉపయోగిస్తుంటారు. ఇది టాక్సీలు, బస్సులు, ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలపై కనిపిస్తుంది. ఇందులో పసుపు రంగు నంబర్ ప్లేట్‌పై నల్లని అక్షరాలు రాసి ఉంటాయి.

ఆకుపచ్చ పలకపై ఎరుపు రంగు..

ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ ప్లేట్‌పై తెలుపు రంగుతో నంబర్లు రాసి ఉన్న నంబర్ ప్లేట్‌లను ఉపయోగిస్తుంటారు. ఇది ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలపై కనిపిస్తుంది.

ఆకుపచ్చ పలకపై పసుపు రంగు సంఖ్యలు..

కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ రంగుపై పసుపు రాసి నంబర్లతో కూడిన నంబర్ ప్లేట్లు ఇస్తారు. ఇది ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ బస్సు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలు కావొచ్చు.

నీలం పలకలపై తెల్లని సంఖ్యలు..

విదేశీ దౌత్యవేత్తల కోసం రిజర్వు చేసిన వాహనాలకు బ్లూ నంబర్ ప్లేట్లు జారీ చేస్తుంటారు. మీరు ఇలాంటి నంబర్‌ను గమనిస్తే.. అది విదేశీ దౌత్యవేత్తలకు చెందిన వాహనమని అర్థం చేసుకోవచ్చు.

నలుపు పలకపై పసుపు రంగు సంఖ్యలు..

బ్లాక్ ప్లేట్‌లపై పసుపు రంగు నంబర్లతో కూడిన నంబర్ ప్లేట్లు అద్దె కార్ల కోసం ఉపయోగిస్తుంటారు. లగ్జరీ హోటళ్లు ఉపయోగించే కమర్షియల్ కార్లలో కూడా ఇదే సంఖ్య కనిపిస్తుంది.

పై సూచిక..

రక్షణ వాహనాలకు పైకి బాణం గుర్తు ఉన్న నంబర్ ప్లేట్లు ఇస్తారు. ఈ నంబర్ ప్లేట్ రక్షణ మంత్రిత్వ శాఖ వాహనాలపై కనిపిస్తుంది. ఆర్మీ అధికారులు ఈ నంబర్ ప్లేట్‌తో ఉన్న కార్లను వాడుతుంటారు.

ఎరుపు పలకపై అశోక చిహ్నం..

ఎరుపు పలకపై అశోక చిహ్నం ఉన్న నంబర్ ప్లేట్ రాష్ట్రపతి, భారత గవర్నర్ వాహనాలపై మాత్రమే ఉపయోగిస్తారు. ఈ నంబర్ ప్లేట్లపై సంఖ్యకు బదులు అశోక చిహ్నాన్ని ఉంచుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories