Maruti Cars: ఆల్టో నుంచి వ్యాగన్ ఆర్ వరకు.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మారుతీ.. ఆఫర్ మిస్సయితే, కొనడం కష్టమే..!

Maruti Cars: ప్రస్తుత మార్చి నెలలో, మారుతి సుజుకి తన అనేక మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. వీటిలో ఆల్టో, వ్యాగన్ఆర్ సెలెరియో, ఎస్-ప్రెస్సో ఉన్నాయి.

Jyothi
Updated on: 31 March 2024 10:00 AM IST
From Alto to Wagon R and Celerio check Maruti huge discount offers
X

Maruti Cars: ఆల్టో నుంచి వ్యాగన్ ఆర్ వరకు.. భారీ డిస్కౌంట్లు ప్రకటించిన మారుతీ.. ఆఫర్ మిస్సయితే, కొనడం కష్టమే..!

Maruti Discount Offers: మార్చి నెల ముగుస్తోంది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కొత్త ఆర్థిక సంవత్సరంతో పలు కార్ల కంపెనీలు తమ కార్ల ధరలను పెంచబోతున్నాయి. అయితే, దీనికి ముందు, ప్రస్తుత మార్చి నెలలో, మారుతి సుజుకి తన అనేక మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

అరేనా డీలర్‌షిప్‌లో విక్రయించే కొన్ని మారుతీ కార్లు రూ. 67000 వరకు తగ్గింపును పొందుతున్నాయి. వీటిలో ఆల్టో, వ్యాగన్ఆర్ సెలెరియో, ఎస్-ప్రెస్సో ఉన్నాయి. మారుతి సుజుకి తన ఆటో కె10పై రూ.67000, ఎస్-ప్రెస్సోపై రూ.66000, వ్యాగన్ ఆర్‌పై రూ.66000, సెలెరియోపై రూ.61000 పొదుపు అవకాశాన్ని అందిస్తోంది. ఈ ఆఫర్లు మార్చి నెల వరకు చెల్లుతాయి.

నగదు తగ్గింపుతో పాటు, ఈ ఆఫర్‌లు కార్పొరేట్ తగ్గింపు లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి అనేక ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉండవచ్చు. ఇది కాకుండా, డీలర్‌షిప్, మీ నగరాన్ని బట్టి కూడా డిస్కౌంట్ ఆఫర్‌లు మారవచ్చు. కాబట్టి, కారును కొనుగోలు చేసే ముందు డీలర్‌షిప్ నుంచి తగ్గింపు ఆఫర్‌లను ధృవీకరించాలి.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. అనేక నెలలుగా అత్యధికంగా అమ్ముడవుతోంది. అదే సమయంలో ఆల్టో అమ్మకాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ, S-Presso, Celerio అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇది సాధారణంగా అమ్మకాల పరంగా టాప్-20 కార్లలో కూడా ఉండదు.

వ్యాగన్ ఆర్ ధర శ్రేణి రూ. 5.54 లక్షల నుంచి రూ. 7.38 లక్షలు, సెలెరియో ధర శ్రేణి రూ. 5.37 లక్షల నుంచి రూ. 7.09 లక్షలు, ఎస్-ప్రెస్సో ధర శ్రేణి రూ. 4.26 లక్షల నుంచి రూ. 6.12 లక్షలు, ఆల్టో కె10 ధర రేంజ్ రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.96 లక్ష వరకు ఉన్నాయి.

Jyothi

Jyothi

Next Story