OPPO K12x 5G: లో బడ్జెట్‌లో 5G స్మార్ట్‌ఫోన్‌.. రూ. 7,950 భారీ డిస్కౌంట్

Flipkart announced huge discount offer on OPPO K12x 5G
x

బడ్జెట్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. స్మార్ట్‌ఫోన్‌పై రూ. 7,950 డిస్కౌంట్

Highlights

OPPO K12x 5G price and specifications : ఒప్పో K12x 5జీ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.

OPPO K12x 5G: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ బడ్జెట్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రూ.12000 బడ్జెట్‌లో మంచి 5G ఫోన్ కొనాలనుకొనే వారికి ఇది సరైన అవకాశం. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ OPPO K12x 5Gపై భారీ ఆఫర్ ప్రకటించింది. అలానే ఈ ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లను కూడా అందిస్తోంది. ఫోన్‌లో 6.67 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంది. 32MP బ్యాక్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఒప్పో K12x 5G ఆఫర్స్

ఒప్పో K12x 5జీ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల విషయంలో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత అసలు ధర రూ. 11,999 అవుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 7,950 ఆదా చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ పర్ఫామెన్స్, బిల్డ్ క్వాలిటీ, కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

ఒప్పో K12x 5G స్పెసిఫికేషన్స్

ఒప్పో K12x 5G 6.67 అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 720x1604 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్ 1000 నిట్స్. K12x 5Gలో MediaTek Dimension 6300 ప్రాసెసర్, Mali-G57 GPU ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఆధారంగా పనిచేస్తుంది. కెమెరా సెటప్ విషయానికొస్తే... K12x 5G వెనుక భాగంలో 32MP ప్రైమరీ కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ అన్‌లాకింగ్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.1, GPS, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories