Maruti Suzuki: మరో 2 ఎస్‌యూవీలను తీసుకొస్తోన్న మారుతీ సుజుకీ.. పేర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తోందిగా.. ఫీచర్లైతే పరేషానే..!

Maruti Suzuki: మారుతీ సుజుకీ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశంలో రెండు కొత్త పేర్లను నమోదు చేసింది.

Arun Chilukuri
Updated on: 25 March 2024 4:00 PM IST
Escudo and Torqnado Two Suvs Names Maruti Suzuki Trademarked in India Check Price and Features
X

Maruti Suzuki: మరో 2 ఎస్‌యూవీలను తీసుకొస్తోన్న మారుతీ సుజుకీ.. పేర్లతోనే మార్కెట్‌ను షేక్ చేస్తోందిగా.. ఫీచర్లైతే పరేషానే..!

Maruti Suzuki: మారుతీ సుజుకీ మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశంలో రెండు కొత్త పేర్లను నమోదు చేసింది. దీంతో దేశంలో రెండు కొత్త వాహనాలను లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు చర్చ మరింత పెరుగుతుంది. బ్రాండ్ తన రాబోయే వాహనాల కోసం Escudo, Torquenado పేర్లను నమోదు చేసింది.

జపాన్‌లో సుజుకి విటారా SUV పేరు Escudo, కొత్త పేరు Torqnado. ఇప్పటి వరకు, ఏ వాహనాలకు ఈ పేర్లు పెడతారు అనే దానిపై అధికారిక ధృవీకరణ రాలేదు. అదే సమయంలో, మారుతి మొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారు eVX కి టోర్క్నాడో అని పేరు పెట్టవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. బ్రాండ్ ఈ ఏడాది చివరి నాటికి ఈ EVని ప్రారంభించవచ్చు.

మరోవైపు, మారుతి సుజుకి తన కొత్త తరం స్విఫ్ట్, డిజైర్‌లను కూడా పరీక్షిస్తోంది. ఇది రాబోయే కొద్ది నెలల్లో ప్రారంభించవచ్చు. ఇటీవలే కొత్త డిజైర్ సెగ్మెంట్-ఫస్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో ఈ వారం టెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story