Car Tyres: మీ కార్ హైస్పీడ్ ఎంతో తెలుసా? టైర్ నంబర్ చూసి ఇట్టే చెప్పేయోచ్చు.. ఎలాగో తెలుసా..?
Car Tyres: టైర్‌పై కొన్ని నంబర్‌లు (193/60 R15 94W) రాసి ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు.
Car Tyres: మీ కార్ హైస్పీడ్ ఎంతో తెలుసా? టైర్ నంబర్ చూసి ఇట్టే చెప్పేయోచ్చు.. ఎలాగో తెలుసా..?
Car Tyres: టైర్‌పై కొన్ని నంబర్‌లు (193/60 R15 94W) రాసి ఉండడాన్ని మీరు గమనించే ఉంటారు. కానీ, ఈ సంఖ్యలు ఎందుకు రాస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. వీటి వెనుక ఎంతో సమాచారం దాగుంది. ఈ సంఖ్యలు టైర్ ఎంత వెడల్పుగా ఉంది, ఎంత పొడవు, ఏ సైజు రిమ్‌కు సరిపోతుంది, టాప్ స్పీడ్‌కు ఏది ఉత్తమమైనది, దాని లోడ్ కెపాసిటీ ఎంత అనే విషయాలను తెలియజేస్తుంది.
ఈ నంబర్లలో ముఖ్యంగా మీరు టైర్ నంబర్స్ చూసి. దాని టాప్ స్పీడ్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. టైరుపై వేర్వేరు నంబర్లు, వేర్వేరు టాప్ స్పీడ్‌లను సూచిస్తుంటాయి. ఉదాహరణకు పైన పేర్కొన్న నంబర్లలో చివర్లో W అని రాసి ఉంది. అంటే ఈ టైర్ తుది వేగం 270 kmphగా ఉండాలి.
అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టైర్ వేగాల సూచికలు..
F- 80 kmph
G- 90 kmph
J- 100 kmph
K- 110 kmph
L- 120 kmph
M- 130 kmph
N- 140 kmph
P- 150 kmph
Q- 160 kmph
R- 170 kmph
S- 180 kmph
T- 190 kmph
U- 200 kmph
H- 210 kmph
V- 240 kmph
W- 270 kmph
Y- 300 kmph
(Y)- 300+ kmph


