Electric Cars: రూ. 10 లక్షల లోపే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ వరకు ప్రయాణం!

Electric Cars: రూ. 10 లక్షల లోపే బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ వరకు ప్రయాణం!
x
Highlights

Electric Cars: పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

Electric Cars: పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఎలక్ట్రిక్ వాహనాలు (EV) ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ముఖ్యంగా భారత మార్కెట్లో రూ. 10 లక్షల లోపు ధరలో, అత్యుత్తమ రేంజ్ అందించే కార్లకు డిమాండ్ పెరుగుతోంది. టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ నుంచి అందుబాటులో ఉన్న టాప్-3 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల వివరాలు మీకోసం..

1. టాటా పంచ్ EV (Tata Punch EV)

టాటా నుంచి వచ్చిన ఈ మైక్రో ఎలక్ట్రిక్ SUV ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది.

ధర: రూ. 9.99 లక్షల నుండి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).

రేంజ్: ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 365 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ప్రత్యేకత: ఎస్‌యూవీ లుక్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

2. టాటా టియాగో EV (Tata Tiago EV)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది ఒకటి.

ధర: రూ. 7.99 లక్షల నుండి ప్రారంభం (ఎక్స్-షోరూమ్).

రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 293 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.

ప్రత్యేకత: సిటీ డ్రైవింగ్‌కు మరియు చిన్న కుటుంబాలకు ఇది అత్యంత పొదుపుగా ఉంటుంది.

3. ఎంజీ కామెట్ EV (MG Comet EV)

స్టైలిష్ మరియు కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చే ఈ కారు యువతను బాగా ఆకట్టుకుంటోంది.

ధర: బ్యాటరీ అద్దె ప్రోగ్రామ్ (BaaS) కింద రూ. 4.99 లక్షలకే లభిస్తుంది. సాధారణంగా దీని ధర రూ. 7.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

రేంజ్: ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

రన్నింగ్ కాస్ట్: కిలోమీటరుకు కేవలం రూ. 3.1 బ్యాటరీ ఛార్జ్ పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories