2025 Best Scooter: స్కూటర్ మార్కెట్‌ను ఏలేది ఈ స్కూటర్లే.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. ధర ఎంతంటే..?

2025 Best Scooter
x

2025 Best Scooter: స్కూటర్ మార్కెట్‌ను ఏలేది ఈ స్కూటర్లే.. ఫ్యామిలీకి పర్ఫెక్ట్.. ధర ఎంతంటే..?

Highlights

2025 Best Scooter: ప్రస్తుత కాలంలో స్కూటర్లలో డిస్క్ బ్రేక్‌ సౌకర్యం సర్వసాధారణమైంది, ఇది రైడర్‌లకు మెరుగైన, ప్రభావవంతమైన బ్రేకింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

2025 Best Scooter: ప్రస్తుత కాలంలో స్కూటర్లలో డిస్క్ బ్రేక్‌ సౌకర్యం సర్వసాధారణమైంది, ఇది రైడర్‌లకు మెరుగైన, ప్రభావవంతమైన బ్రేకింగ్ అనుభవాన్ని అందిస్తుంది. డ్రమ్ బ్రేక్‌ల కంటే డిస్క్ బ్రేక్‌లు సురక్షితమైనవి. మీరు శక్తివంతమైన ఇంజిన్, ప్రభావవంతమైన బ్రేకింగ్ ఉన్న స్కూటర్‌ను కొనాలని చూస్తున్నట్లయితే, ఇక్కడ కొన్ని ఉత్తమ ఎంపికలు ఉన్నాయి. రండి.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Hero Destini 125

హీరో డెస్టినీ 125 ఒక నమ్మకమైన ఆప్షన్. ఇది డ్రమ్, డిస్క్ బ్రేక్ ఎంపికలతో వస్తుంది. ఇందులో 124.6సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంది. ఈ ఇంజిన్ 9 పిఎస్ పవర్,10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఫీచర్స్‌లో డిజిటల్-అనలాగ్ డిస్‌ప్లే , ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, క్రోమ్ యాక్సెంట్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉంటాయి. డిస్క్ వేరియంట్ ధర రూ. 81,338.

Honda Activa 125

హోండా యాక్టివా 125 ఒక విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన స్కూటర్. ఈ ఇంజిన్ 8.4 బిహెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 123.9సిసి ఇంజిన్‌ ఉంటుంది. దీనని OBD 2B నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేశారు. ఫీచర్స్‌లో స్టార్ట్-స్టాప్ సిస్టమ్, అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్‌లు వేరియంట్ ప్రారంభ ధర రూ. 89,430.

TVS Jupiter 125

టీవీఎస్ జూపిటర్ 125 అనేది అద్భుతమైన స్పేస్, ఫీచర్స్ అందించే ప్రీమియం స్కూటర్. ఇందులో ఉండే 124.8సిసి ఇంజిన్ 8.3 పిఎస్ పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్స్‌లో డిజిటల్-అనలాగ్ క్లస్టర్, 32-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్‌లు వేరియంట్ ధర రూ. 92,646.

Suzuki Access 125

సుజుకి యాక్సెస్ 125 దాని విభాగంలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్. ఇందులో 125సిసి ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 8.7 పిఎస్ పవర్, 10 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్స్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, మల్టీఫంక్షన్ డిజిటల్ మీటర్, ఈజీ స్టార్ట్ సిస్టమ్ ఉన్నాయి. దీని డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 85,601.

Yamaha Fascino 125

యమహా ఫాసినో 125 దాని స్టైలిష్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. ఇందులో 125సిసి హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 8.2 పిఎస్ పవర్, 10.3 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, ఆకర్షణీయమైన డిజైన్, గొప్ప రైడ్ క్వాలిటీని అందిస్తుంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 93,230.

Show Full Article
Print Article
Next Story
More Stories