Hero Motocorp: హీరో స్కూటర్లు, బైక్‌లపై అద్భుతమైన ఆఫర్లు.. పండుగ ముందు తగ్గింపు!

Hero Motocorp: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.

Arun Chilukuri
Updated on: 30 Sept 2022 4:00 PM IST
Amazing Offers on Hero Scooters Bikes Pre Festival Discount
X

Hero Motocorp: హీరో స్కూటర్లు, బైక్‌లపై అద్భుతమైన ఆఫర్లు.. పండుగ ముందు తగ్గింపు!

Hero Motocorp: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లపై అద్భుతమైన పండుగ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. హీరో గ్రాండ్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ్ ట్రస్ట్ (GIFT)ని ప్రారంభించింది. దీని కింద తన వాహనాలపై రూ.13500 వరకు ఆఫర్లను అందిస్తోంది. ఈ పరిమిత ఆఫర్ 26 సెప్టెంబర్ నుంచి 5 అక్టోబర్ 2022 వరకు చెల్లుబాటు అవుతుంది.

హీరో మోటోకార్ప్ తన స్కూటర్లపై రూ.5,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.3,000 వరకు నగదు తగ్గింపును అందిస్తోంది. ఇది కాకుండా ఒక సంవత్సరం బీమా ప్రయోజనం, 2 సంవత్సరాల ఉచిత మెయింటనెన్స్‌, రూ.4,000 విలువైన గుడ్‌లైఫ్ గిఫ్ట్ వోచర్, 5 సంవత్సరాల వారంటీ, 0% వడ్డీతో 6 నెలల EMI అందిస్తుంది. అమ్మకాలను మరింత పెంచుకోవడానికి హీరో మోటోకార్ప్ డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలను అందించడమే కాకుండా కంపెనీ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

ఈ పండుగ సీజన్‌లో హీరో మోటోకార్ప్ 8 కొత్త మోడళ్లను (బైక్‌లు, స్కూటర్‌లతో సహా) విడుదల చేయాలని ఆలోచిస్తుంది. కొత్త ఉత్పత్తులు అలాగే ఇప్పటికే ఉన్న మోడల్ కొత్త కలర్ వేరియంట్‌ల అప్‌డేటెడ్ వెర్షన్‌లు ఉంటాయి. కస్టమర్ల అవసరాలు, నిర్దిష్ట ప్రాంతీయ మార్కెట్‌లను దృష్టిలో ఉంచుకుని రాబోయే మోడళ్లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఉత్పత్తులలో ఒకటైన Xtreme 160R స్టీల్త్ 2.0 ఎడిషన్ కూడా ప్రారంభించింది. ఇది కాకుండా ఈ పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ (హీరో విడా) కూడా పరిచయం అవుతోంది.

రాబోయే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త విడా సబ్-బ్రాండ్ కింద వస్తుంది. ఈ-స్కూటర్ ధర దాదాపు రూ.1 లక్ష వరకు ఉంటుంది. మార్కెట్లో ఇది బజాజ్ ఈ-చేతక్, TVS iQube, Ola S1 ప్రో వంటి వాటికి సవాలుగా నిలుస్తుంది. తన రాబోయే ఈ-స్కూటర్ ధరలు, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను త్వరలోనే వెల్లడిస్తానని కంపెనీ ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story