Tata Altroz: జూన్ 2 నుంచి బుకింగ్స్ ప్రారంభం.. 7 లక్షల లోపే బాలెనోకు షాక్ ఇవ్వనున్న టాటా

Tata Altroz
x

Tata Altroz: జూన్ 2 నుంచి బుకింగ్స్ ప్రారంభం.. 7 లక్షల లోపే బాలెనోకు షాక్ ఇవ్వనున్న టాటా

Highlights

Tata Altroz: మారుతి సుజుకి బాలెనోకు గట్టి పోటీనిచ్చేలా, టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ (Altroz)ను పూర్తిగా అప్‌డేట్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది.

Tata Altroz: మారుతి సుజుకి బాలెనోకు గట్టి పోటీనిచ్చేలా, టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ (Altroz)ను పూర్తిగా అప్‌డేట్ చేసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. సరికొత్త ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో వచ్చిన ఈ కారు భారతీయ మార్కెట్‌లో మరోసారి సంచలనం సృష్టించనుంది. 2020లో లాంచ్ అయినప్పటి నుంచి ఆల్ట్రోజ్ ఇప్పటివరకు 2.96 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైందని టాటా మోటార్స్ ప్రకటించింది. త్వరలోనే ఈ కారు 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటనుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త అప్‌డేట్‌తో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

కొత్త ఫేస్‌లిఫ్టెడ్ టాటా ఆల్ట్రోజ్ ప్రారంభ ధర రూ.6,89,000 (ఎక్స్-షోరూమ్). ఇది గత మోడల్ ప్రారంభ ధర రూ.6,65,000 కంటే రూ.24,000 ఎక్కువ. కొత్త ఆల్ట్రోజ్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా కొత్త ఆల్ట్రోజ్ గతంలో మాదిరిగానే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ (CNG) ఆప్షన్లలో లభిస్తుంది. ఒక పెద్ద మార్పు ఏమిటంటే.. కొత్త ఆల్ట్రోజ్ పెట్రోల్ మోడల్‌లో 5-స్పీడ్ ఏఎంటి (AMT) ఆప్షన్ ఇప్పుడు రూ.8,29,000 నుంచి రూ.9,65,000 మధ్య అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే ఆధునిక సౌకర్యాలను కోరుకునే కస్టమర్ల అవసరాలను తీర్చడమే ఈ మోడల్‌ను ప్రవేశపెట్టడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.

అందంగా కనిపించే ఆల్ట్రోజ్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. లోపల, బయట అనేక మార్పులతో ఇది అప్‌డేట్ చేయబడింది. లగ్జరీ ఫీచర్లతో పాటు, భద్రతా ఫీచర్లను కూడా మెరుగుపరిచారు. జూన్ 2న కొత్త ఆల్ట్రోజ్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఈ స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ డిమాండ్ మళ్లీ పెరుగుతుందని భావిస్తున్నారు. జనవరి 2020లో లాంచ్ అయినప్పటి నుంచి ఆల్ట్రోజ్, టాటా మోటార్స్ మొత్తం కార్ల అమ్మకాల్లో 13శాతం వాటాను అందించింది. ఇది 2.33 మిలియన్ యూనిట్లలో ఒక భాగం.

కొత్త అవతార్‌లో టాటా ఆల్ట్రోజ్ డిజైన్‌లో పెద్ద మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా ముందు భాగంలో ఈ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ఐబ్రో-స్టైల్ ఎల్‌ఈడి డీఆర్‌ఎల్స్‌తో (LED DRLs) కూడిన ఆల్-ఎల్‌ఈడి హెడ్‌లైట్లు కొత్త లుక్‌ను ఇస్తాయి. గ్రిల్‌కు కొత్త డిజైన్ ఇచ్చారు. దానిపై టాటా మోనోగ్రామ్ ఉంటుంది. ఇది కారుకు మరింత మెరుగైన రూపాన్ని ఇస్తుంది. వాహనానికి సరికొత్త రూపాన్ని ఇవ్వడానికి బంపర్ డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. లగ్జరీ అనుభూతిని ఇచ్చే ఇంటీరియర్‌‌‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఉటుంది. హర్మన్ కంపెనీ నుండి వచ్చిన ఈ టచ్‌స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేస్తుంది. ఫుల్-డిజిటల్ హెచ్‌డి 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, వాయిస్-ఎనేబుల్డ్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ అప్‌డేట్‌లతో, టాటా ఆల్ట్రోజ్ మార్కెట్లో మరింత దూకుడుగా ముందుకు సాగుతూ బాలెనోకు గట్టి పోటీనివ్వడానికి సిద్ధంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories