Petrol Pump Fraud: వాహనదారులకి అలర్ట్‌.. ఈ చిట్కాలు పాటించి పెట్రోల్ పంప్ మోసాలని గుర్తించండి..!

Alert to Motorists Follow These Tips and Identify Petrol Pump Scams
x

Petrol Pump Fraud: వాహనదారులకి అలర్ట్‌.. ఈ చిట్కాలు పాటించి పెట్రోల్ పంప్ మోసాలని గుర్తించండి..!

Highlights

Petrol Pump Fraud: వాహనంలో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బంక్‌ ఉద్యోగులు మోసాలకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి.

Petrol Pump Fraud: వాహనంలో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బంక్‌ ఉద్యోగులు మోసాలకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. తరచుగా దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్‌ బంక్‌ మోసాల గురించి వార్తులు వినిపిస్తూనే ఉన్నాయి. దేశంలో ఇదొక పెద్ద సమస్యలా తయారైంది. కారు లేదా బైక్‌లో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు ఇచ్చే డబ్బులకి సరిపడ ఇంధనాన్ని నింపారా లేదా అని తనిఖీ చేస్తూ ఉండాలి. అంతేకాదు ఇంధనం సరైనదేనా లేదా కల్లీ అయినదా అని కూడా తెలుసుకోవాలి. ఈ చిట్కాలని పాటించి ఇలాంటి మోసాలని నివారించండి.

1. బంక్‌లో పెట్రోల్‌ కొట్టించేటప్పుడు ముందుగా మీటర్ రీడింగ్‌ని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇంధనాన్ని నింపేటప్పుడు మీటర్ రీడింగ్‌పై ఓ కన్నేసి ఉంచాలి. మీటరు సరిగ్గా చూపకపోతే సదరు ఉద్యోగిని నిలదీయాలి. అలాగే ఇంధన నాజిల్‌ని కూడా గమనించాలి.

2. వాహనదారులు అవసరమనుకుంటే ఫిల్టర్ పేపర్ పరీక్ష చేయవచ్చు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం అన్ని పెట్రోల్ పంపులు ఫిల్టర్ పేపర్లని ఉంచుకోవాలి. ఈ పేపర్‌పై కొన్ని చుక్కల పెట్రోల్‌ను వేయడం ద్వారా ఇంధనాన్ని పరీక్షించవచ్చు. పెట్రోలు స్వచ్ఛంగా ఉంటే కాగితంపై మరక ఉండదు. మరకలు కనిపిస్తే పెట్రోల్ కల్తీ అయినట్లు.

3. వినియోగదారులని మోసం చేయడానికి బంక్ ఉద్యోగులు మీటర్‌ను తారుమారు చేస్తారు. తక్కువ ఆయిల్‌ వచ్చినట్లు అనిపిస్తే 5 లీటర్ల గొట్టంలో ఇంధనాన్ని నింపి చెక్‌ చేయవచ్చు. దీని ద్వారా ఎంత ఆయిల్‌ వస్తుందో తెలుస్తుంది.

4. కొత్త పెట్రోల్ పంప్‌కు వెళ్లి ఉంటే ఆ పంపు గురించిన సమాచారాన్ని సేకరించవచ్చు. దీని కోసం దాని వెబ్‌సైట్‌కి వెళ్లి సమాచారాన్ని చదవవచ్చు. తేడా వస్తే ఇండియన్ ఆయిల్ కస్టమర్ కేర్ నంబర్ 1800-2333-555 కాగా భారత్ పెట్రోలియం కస్టమర్ కేర్ నంబర్ 1800224344కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories